Champions Trophy 2025: టీమ్ఇండియా ఎంపికపై వీడని సస్పెన్స్

వచ్చే నెలలో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి జట్టు ఎంపికపై టీమ్ఇండియా(Team India) సెలక్టర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. టీమ్‌లోకి ఎవరిని తీసుకోవాలన్న దానిపై కోచ్ గౌతమ్ గంభీర్(Coach Gautam Gambhir), చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్(Chief Selector Ajit Agarkar), BCCI పెద్దలు విస్తృతంగా చర్చిస్తున్నారు. అయితే ఈ సారి జట్టులో కొందరు సీనియర్, జూనియర్ ప్లేయర్లను యాజమాన్యం పక్కనపెట్టే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఇటీవల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(BGT)లో గాయపడిన బుమ్రా, వరల్డ్ కప్‌లో గాయపడిన షమీ ఇంకా కోలుకోనట్లుగానే కనిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించేందుకు చివరి తేది జనవరి 12వ తేదీనే అయినప్పటికీ BCCI జట్టు ఎంపిక కోసం మరో వారం అదనంగా సమయ కావాలని ICCని కోరింది. అటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ తమ జట్ల జాబితాను ప్రకటించాయి.

జట్టులో దక్కేది చోటు వీరికేనా?

ఇంకా టీమ్ఇండియా, సౌతాఫ్రికా, పాకిస్థాన్ జట్లు తమ జట్లను ప్రకటించలేదు. వీరికి ICC వారం గడువు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా టీమ్ఇండియా కూర్పు ఈసారి కాస్త భిన్నంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. సీనియర్లు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బూమ్రా(Bumrah) వంటి ఆటగాళ్లకు అవకాశం దక్కడం ఖాయంగా తెలుస్తోంది. ఓపెనింగ్ కోసం శుభమన్ గిల్ లేదా యశస్వీ జైస్వాల్‌లో ఒకరు ఖాయంగా తెలుస్తోంది. ఇక రిషభ్ పంత్, హార్ధిక్ పాండ్యాతో పాటు సంజూ శాంసన్ ఉండవచ్చు. శ్రేయస్ అయ్యర్ లేదా నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy)లో ఒకరు, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలను ఆల్ రౌండర్ కేటగిరీలో తీసుకోవచ్చు.

Champions Trophy 2025: When will Team India announce squad for ODIs? | News  - Business Standard

ఎనిమిది జట్లు.. రెండు గ్రూపులు

కాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ దాదాపు 8 ఏళ్ల తరువాత తిరిగి జరగనుంది. పాకిస్థాన్, UAE వేదికగా ఫిబ్రవరి 19 నుంచి మార్చ్ 9 వరకు 8 జట్ల మధ్య ఈ మినీ వరల్డ్ కప్ నిర్వహించనున్నారు. ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు, సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించిన రోస్టర్ నుంచి రెండు జట్లు ఉంటాయి. భారత్, ఆతిథ్య పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లు గ్రూప్ Aలో ఉండగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్‌ గ్రూప్ బీలో ఉన్నాయి. శ్రీలంక, వెస్టిండిస్ జట్లు ఈ సారి ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించలేకపోవడం గమనార్హం.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *