
పట్టణాలు ఖాళీ అయ్యాయి. నగరాలు వెలవెలబోయాయి. ఇన్నిరోజులు వర్క్ లైఫ్(Work Life)తో బిజీబిజీగా గడిపిన వారంతా పల్లెబాట పట్టారు. దీంతో ఎక్కడ చూసినా సంక్రాంతి(Sankranti) సందడే నెలకొంది. మూడు రోజుల పండగను చిరకాలం గుర్తిండిపోయేలా నిర్వహించుకుంటున్నారు. కోడిపందేలు, ఎద్దుల పోటీలు, గాలిపటాలు ఎగరేస్తూ సంతోషంగా ఈ ఫెస్టివల్(Festival) నిర్వహించుకునేకుందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ(Department of Meteorology) వర్షాల(Rains)పై బిగ్ అప్డేట్ ఇచ్చింది. రానున్న మూడు రోజులు AP, తమిళనాడు(Tamilnadu)లోని తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, మైలాడుతురై, పుదుకోట్టై జిల్లాలు, కారైకల్‌లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బంగాళాఖాతం(Bay of Begal)లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది. దీని ప్రభావంతో సోమ, మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
అక్కడ అలా.. ఇక్కడ ఇలా..
వాతావరణ శాఖ వర్షాల సూచన మేరకు ఆంధ్రప్రదేశ్(Ap), యానం(Yanam)లో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య- తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన ఉన్నట్లు తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో పొడి వాతావరణం ఉంటుందని, అలాగే దక్షిణ కోస్తాంధ్రలో ఈ మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల వానలు పడే ఛాన్సుందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉండగా నెలూరు జిల్లాలో అర్ధరాత్రి నుంచే జోరుగా వర్షం పడుతోంది. మరోవైపు తెలంగాణ(Telangana)లో వాతావరణంలో మార్పులు కనిపిస్తాయని, ఈ మూడురోజులు మబ్బులు రావడంతోపాటు పొగమంచు అధికంగా కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Centre) పేర్కొంది.