BHOGI: తెలుగు లోగిళ్లలో వైభవంగా భోగి పండుగ

తెలుగు రాష్ట్రాల్లోని పెద్ద పండగల్లో సంక్రాంతి(Sankranti) ఒకటి. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా మొదటి రోజు భోగి(Bhogi) పండుగ చేసుకుంటారు. ఈ పండుగ ప్రకృతితో మనిషికి అనుబంధాన్ని, వ్యవసాయం(Agriculture) ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. ఈ పండుగ కొత్త పంటల రాకను సూచిస్తుంది. అందుకే రైతుల(Formers)కు ఈ ఫెస్టివల్ ఎంతో ఇష్టమైనది చెబుతారు. భోగి పండుగ ఒకరికొకరు కలిసి ఆనందాన్ని పంచుకోవాలని నేర్పుతుంది. మకర సంక్రాంతికి ఒకరోజు ముందు ఈ భోగి చేస్తుంటారు. చిన్నారులపై భోగి పళ్ల(Bhogi Pallu)ను పోస్తారు. ఈ ఏడాది నేడు అనగా జనవరి 13న రెండు తెలుగు రాష్ట్రాల్లో భోగి పండగను అత్యంత సంబరంగా జరుపుకుంటున్నారు. ఊరూరా, పల్లె పల్లెనా తెల్లవారుజామునే నిద్ర లేచి భోగి మంటలు కాలుస్తున్నారు. అయితే ఈ భోగి అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రోజు భోగి మంటలు ఎందుకు కాలుస్తారు? అనేది తెలుసుకుందాం..

కారణాలు ఏవైనా.. కష్టాలు తొలగాలనేదే ఉద్దేశం

భగ్(Bhag) అనే సంస్కృత పదం నుంచి ‘భోగి(Bhogi)’ అనే పదం వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. భోగం అంటే పవిత్రమైనది. పురాణాల ప్రకారం శ్రీరంగనాథ స్వామిలో, గోదా దేవి లీనమై భోగాన్ని పొందింది. ఇదే రోజు గోకులంలో శ్రీకృష్ణుడు(Lord Srikrishna) గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను గోపాలకులను రక్షించారని పండితులు చెబుతారు. వీటన్నింటికి ప్రతీకగా భోగి పండుగ జరుపుకోవడం సంప్రదాయంగా మారిందని పురాణ గాథ. అలాగే సంక్రాంతి సమయంలో సూర్యడు దక్షిణయానం నుంచి ఉత్తరాయానంలోకి ప్రవేశిస్తాడు. అయితే గడిచిన దక్షిణాయనంలో తాము పడిన కష్టాలు, బాధలు కొత్త సంవత్సరంలో ఉండకూడదని కోరుకుంటూ భోగి మంటలను వేస్తారట. శాస్త్రీయ పరంగా చూస్తే, ఈ సమయంలో ఉష్ణోగ్రతలు తగ్గి చలి ఎక్కువ అవుతుంది. ఈ చలిని తట్టుకునేందుకు భోగి మంటలు వేస్తుంటారు.

భోగి, సంక్రాంతి, కనుమ పండుగల ప్రాముఖ్యత ఏమిటి ? ఎందుకు ఇది పెద్దపండుగ ? |  Importance of Bhogi, Sankranthi and Kanuma festivals

భోగి మంట ఆరోగ్యానికీ ఎంతో మంచిది.. ఎందుకంటే

భోగి మంట కేవలం వెచ్చదనం కోసం మాత్రమే కాదు ఆరోగ్యాని(Health)కి కూడా ఎంతో మంచిదట. ధనుర్మాసంలో రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఇళ్ల ముందు పిడకలను కాల్చడం వల్ల గాలిలోని సూక్ష్మజీవులు నశించి గాలి స్వచ్ఛంగా మారుతుంది. భోగి మంటల్లో రావి, మామిడి, మేడి వంటి ఔషధ చెట్ల బెరళ్లతో పాటు ఆవు నెయ్యి కూడా వేస్తుంటారు. ఇవన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినవి కాబట్టి వీటిని కాల్చడం వల్ల వచ్చే గాలిని పీల్చడం వల్ల శరీరంలోని 72వేల నాడులు ఉత్తేజితం అవుతాయట. తద్వారా అనేక రోగాల నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతుంటారు.

Bhogi 2024: భోగి రోజున భోగిపళ్ళుగా మారే రేగిపళ్ళు.. ఎందుకు పోస్తారు..  శాస్త్రీయ కోణం ఏమిటంటే.. - Telugu News | Sankranti 2024: Procedure and  Importance of Bhogi Pallu on Bhogi festival ...

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *