ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం ‘మహా కుంభమేళా(Maha Kumbhamela)’ అట్టహాసంగా ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్(UP)లోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో ఈరోజు నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకూ ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇప్పటికే వేలాదిగా తరలి వస్తున్న భక్తులు గంగా, యమునా, సర్వసతి నదులు కలిసే చోటైన త్రివేణీ సంగమం(Triveni Sangam) వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. సాధవులు, సాధ్వీలు, నాగసాధువులు, కల్పవాసీలు భారీగా హాజరవుతున్నారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళాకు కేంద్రం, UP ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది.
Amidst thunderous chants of ‘Har Har Gange’ and braving the winter chill, millions of pilgrims move towards the Sangam.
Their unwavering devotion is a powerful reminder that the longing for spiritual fulfilment unites humanity beyond nationality, language, and beliefs.… pic.twitter.com/UEIMZlwTjx
— Mahakumbh (@MahaKumbh_2025) January 12, 2025
4 వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాట్లు
ఇదిలా ఉండగా ఈ కుంభమేళా కోసం భారత్(India) నుంచే కాదు.. విదేశాల నుంచి సైతం భక్తులు(Devotees) హాజరుకానున్నారు. దాదాపు 35 కోట్ల మంది వరకూ వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కుంభమేళా కోసం UP సర్కార్ దాదాపు రూ.7000 కోట్లు కేటాయించింది. 4 వేల హెక్టార్ల విస్తీర్ణంలో దీనికి ఏర్పాట్లు చేయగా.. 12కిలోమీటర్ల మేర ఘాట్లు సిద్ధం చేశారు. అలాగే 67వేల వీధి దీపాలు, 1.20 లక్షల మరుగుదొడ్లు(Toilets) నిర్మించారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 45 వేల మంది పోలీసులు, 55 పోలీస్ స్టేషన్లు, డ్రోన్లు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు(Cyber security experts) అందుబాటులో ఉన్నారు.
భక్తులకు మహాప్రసాదం అందించనున్న అదానీ గ్రూప్
ఇదిలా ఉండగా 46 రోజులపాటు సాగే ఈ కుంభమేళాకు సామాజిక సేవలోభాగంగా అదానీ గ్రూప్(Adani Group) 50 లక్షల మంది భక్తులకు మహాప్రసాదం(Maha Prasadam) అందించనుంది. కుంభమేళా ప్రాంతంలో మాత్రమే కాదు వెలుపల రెండు వంటశాలలలో భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది. మహా కుంభ ప్రాంతంలోని 40 ప్రదేశాలలో మహాప్రసాదం పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో 2,500 మంది వాలంటీర్లు పాల్గొంటారు. అలాగే ఈ మహాకుంభ్ సమయంలో ఐదు లక్షల భగవద్గీత కాపీల(Copies of Bhagavad Gita)ను భక్తులకు పంచనున్నామని వెల్లడించింది.
Mahakumbh 2025, Prayagraj: The Countdown Begins
The Kumbh Mela stands as a profound testament to the unwavering faith of Hindus, a sacred confluence of spirituality and devotion. Among its manifestations, the Maha Kumbh holds a unique place —a rarity that transcends generations. pic.twitter.com/zOPviV6uGs
— Ashok Singhal (@TheAshokSinghal) January 12, 2025






