JioHotstar: మరో ఐదు రోజుల్లో ఐపీఎల్.. యూజర్లకు జియో గుడ్‌న్యూస్

మ‌రో ఐదు రోజుల్లో ఇండియ‌న్ ప్రీమియం లీగ్ (IPL)కు తెర‌లేవ‌నుంది. ఈ నెల 22 నుంచి ఈ మెగా క్రికెట్ సంబంరం ప్రారంభం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుత‌గా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ను డిజిట‌ల్ వేదిక‌గా జియో(JIO) టెలికాస్ట్ చేయ‌నున్న సంగతి తెలిసిందే. అయితే, ఇన్నిరోజులు ఫ్రీ వీక్షించిన ఫ్యాన్స్‌కు హాట్‌స్టార్‌తో విలీనం రూపంలో జియో షాకిచ్చింది. మ్యాచ్‌ల‌ను వీక్షించాలంటే వినియోగ‌దారులు క‌నీస స‌బ్‌స్క్రిప్ష‌న్(Minimum subscription) తీసుకోవాల‌నే కండీషన్ పెట్టింది.

Jio launches Rs 100 prepaid recharge plan, offering JioHotstar subscription  and other benefits - India Today

రూ.299 అంత‌కంటే ఎక్కువ ప్లాన్‌ వారికే..

ఈ నేప‌థ్యంలో తాజాగా త‌న వినియోగ‌దారుల‌కు జియో తీపి క‌బురు చెప్పింది. ఎంపిక చేసిన కొన్ని రీఛార్జ్ ప్లాన్ల‌పై జియో యూజ‌ర్లు(Jio Users) 90 రోజుల పాటు ఉచితంగా జియోహాట్‌స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌(JioHotstar Subscription)ను పొంద‌వ‌చ్చ‌ని వెల్ల‌డించింది. వినియోగ‌దారులు రూ. 299 అంత‌కంటే ఎక్కువ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే జియోహాట్‌స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను ఫ్రీగా పొంద‌వ‌చ్చు. దీంతో క్రికెట్ అభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. కాగా ఈనెల 22న ఈ సీజన్ తొలి పోరు కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్(KKR vs RCB) జట్ల మధ్య జరగనుంది.

IPL 2025 : KKR vs RCB Head-to-Head and AI Predictions

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *