79వ ఇండిపెండెన్స్ డే(Independence Day) సందర్భంగా యూజర్లకు జియో హాట్‌స్టార్(Jio Hotstar) ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రేపు (ఆగస్టు 15) జియో హాట్‌స్టార్ తమ మొత్తం కంటెంట్ లైబ్రరీని 24 గంటల పాటు ఉచితం(Free)గా అందుబాటులో ఉంచనుంది. ఈ ఆఫర్లో భాగంగా, సినిమాలు(movies), టీవీ షో(Tv Shows)లు, క్రీడలతోపాటు ఇతర కంటెంట్‌ను సబ్స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా అందరూ చూడవచ్చు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ అంటూ భాషా భేదం లేకుండా ఆల్ లాంగ్వేజస్‌లో ఉన్న షోలు, వెబ్ సిరీస్‌లు, సినిమాలు మొత్తం కంటెంట్‌ను పబ్లిష్ చేయనుంది. ‘ఆపరేషన్ తిరంగ(Operation Tiranga)’ అనే పేరుతో ఆడియన్స్‌కు అందించనున్న ఈ ప్రత్యేక ఆఫర్ కేవలం ఆగస్టు 15వ తేదీ రోజు మాత్రమే ఉండనున్నట్లు ప్రకటించింది.

‘తిరంగా ఏక్, కహానియా అనేక్’ పేరిట కలెక్షన్
ఈ ప్రత్యేక ఆఫర్లో భాగంగా, ‘తిరంగా ఏక్, కహానియా అనేక్ (One is Tiranga, another is Kahaniya)’ అనే క్యూరేటెడ్ కలెక్షన్‌ను ప్రవేశపెట్టారు. ఈ కలెక్షన్లో భారత జాతీయ జెండా రంగులను సూచించే సినిమాలు ఉన్నాయి. కాషాయ రంగు (సఫ్రాన్) కింద ‘టేక్ ఆఫ్’, ‘మద్రాస్ కేఫ్’, ‘ఐబీ71’ వంటి ధైర్యసాహసాల కథలు; తెలుపు రంగు కింద ‘సలాకర్’, ‘నీర్జా’, ‘మంగళ్ పాండే’ వంటి త్యాగధర్మ కథలు ఉండగా.. ఆకుపచ్చ రంగు కింద ‘సర్జమీన్’, ‘కేసరి 2’, ‘ఎయిర్‌లిఫ్ట్’ వంటి సాంస్కృతిక గర్వాన్ని చాటే చిత్రాలు ఉన్నాయి.
🚨 JIOHOTSTAR UNITES WITH THE NATION 🚨
As part of the Independence Day celebrations, JioHotstar has launched an initiative — Operation Tiranga — allowing everyone to use the platform for free on August 15. 🇮🇳 pic.twitter.com/2dqW1FIiAX
— Johns. (@CricCrazyJohns) August 13, 2025
ధైర్యం, త్యాగం, గుర్తింపును ప్రతిబింబించేలా..
ఈ సందర్భంగా జియో హాట్‌స్టార్ బ్రాండ్ & క్రియేటివ్ హెడ్ మినాక్షీ ఆచన్(Meenakshi Achan) మాట్లాడుతూ, “ఈ ఆఫర్ ద్వారా దేశ ధైర్యం, త్యాగం, గుర్తింపును ప్రతిబింబించే కథలను అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నాము” అని తెలిపారు. ఈ కార్యక్రమం టెలివిజన్, డిజిటల్ మీడియా(Digital Media), బహిరంగ ప్రకటనల ద్వారా ప్రచారం చేయబడుతుంది. అంతేకాక, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ(Union Ministry of Information and Broadcasting)తో కలిసి జాతీయ జెండా(National flag) గౌరవాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, జియో హాట్‌స్టార్ ఈ ఆఫర్‌తో భారతీయులందరికీ వినోదం, దేశభక్తిని అందిచనుంది.








