
ప్రస్తుత రోజుల్లో ఎవరికి ఏ సమయంలో ఏమవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. వయసు పిల్లల నుంచి పండు ముసలి వరకూ గుండె సమస్యలు(Heart Problems) తీవ్రంగా వేధిస్తున్నాయి. దీంతో ఎప్పుడు ఆ గుండె ఆగుతుందో తెలియని పరిస్థితి. ఇందుకు మారుతున్న ఆహారపు అలవాట్లు(Eating habits), పని ఒత్తిడి, ఇతర మానసిక ప్రాబ్లమ్స్ కావొచ్చు. ఏదైతేనేం.. చిన్న వయసులోనే అనుకోని మరణంతో కుటుంబాలు తీవ్ర విషాదంలో కూరుకుపోతున్నాయి. తాజాగా మరో బాలీవుడ్ నటి(Bollywood Actress) గుండెపోటు(Heart Attack)తో మరణించింది.
ఆసుపత్రికి తరలించేలోపే..
‘కాంటా లగా(Kanta Laga)’ సాంగ్ ఫేమ్, నటి షఫాలీ జరివాలా (42) (Shefali Jariwala) శుక్రవారం రాత్రి గుండె పోటుతో మరణించింది. ఆమె అస్వస్థతకు గురికావడంతో వెంటనే భర్త పరాగ్ త్యాగి(Parag tyagi) ముంబై అంధేరిలోని బెల్లేవ్యూ ఆసుపత్రికి తరలించారు. అయితే పరీక్షించిన వైద్యులు(Doctors) అప్పటికే ఆమె మృతిచెందినట్లు ధ్రువీకరించారు. అనంతరం పోస్టుమార్టం కోసం ఆమె మృతదేహాన్ని కూపర్ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. కాగా 2005లో వచ్చిన ‘కాంటా లగా’ రిమిక్స్ సాంగ్‌తో కుర్రకారు మదిని దోచిన ఆమె ఒక్కసారి ఫేమస్ అయ్యారు. దీంతో అంతా ‘కాంటా లాగా గర్ల్’గా పిలవడం ప్రారంభించారు.
Shefali Jariwala, gone at just 42. It’s deeply unsettling to see seemingly healthy individuals leaving us so soon.
Moments like these are a stark reminder of how fragile life truly is. At an age meant for thriving, we’re witnessing heartbreaking losses instead.
Gone too soon.… pic.twitter.com/wbKYT0EwFi
— MR . AK (@anandhumanoj666) June 27, 2025
బాలీవుడ్ సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి
ఆ తర్వాత సల్మాన్ ఖాన్(Salman Khan) సినిమా ముజ్సే షాదీ కరోగీ చిత్రంలో ఆమె ఓ పాత్ర దక్కించుకున్నారు. అనంతరం షఫాలీ పలు టీవీ రియాలిటీ షోలలో మెరిశారు. హిందీ బిగ్‌బాస్(Hindi Bigg Bose 13)లోకి సైతం ఎంట్రీ ఇచ్చారు. సోషల్ మీడియా(SM)లో చురుగ్గా ఉండే ఆమె.. అకస్మాత్తుగా మృతిచెందారని తెలియడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమెకు ఇన్‌స్టా(Instagram)లో 33 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె మృతిపై సింగర్ మికా సింగ్(Mikaa Singh) సహా బాలీవుడ్ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 2015లో షఫాలీకి పరాగ్ త్యాగిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.