Mana Enadu : కోలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ (Keerthy Suresh) తన ప్రియుడు ఆంటోనీని ఈనెల 12వ తేదీన వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో హిందూ సంప్రదాయంలో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకతో 15 ఏళ్ల ప్రేమ బంధానికి ఈ జంట ముగింపు పలికి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. అయితే తాజాగా ఈ జంట క్రిస్టియన్ పద్ధతిలో మరోసారి వివాహం చేసుకుంది.
గోవాలోని ఓ హోటల్లో ఇవాళ (ఆదివారం) వీరి వెడ్డింగ్ (Keerthy Suresh Wedding) గ్రాండ్గా జరిగింది. ఈ ఈవెంట్కు కోలీవుడ్ సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. కీర్తి వైట్ కలర్ గౌనులో మెరిసిపోయింది. ఇక ఆంటోనీ కూడా వైట్ సూట్లో కనిపించాడు. ఈ ఫొటోలను కీర్తి తన సోషల్ మీడియాలో షేర్ చేయగా.. సినీ సెలబ్రిటీలు, ఫ్యాన్స్ ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా, ఈనెల 12న గోవాలో కీర్తి, ఆంటోనీ పెళ్లి బంధువులు, సన్నిహితుల సమక్షంలో హిందూ సంప్రదాయంలో జరిగిన విషయం తెలిసిందే. కాలేజీ రోజుల నుంచే కీర్తి – ఆంటోనీ (NYKE Wedding) మంచి స్నేహితులని కీర్తి ఇటీవలే చెప్పింది. సుమారు 15 ఏళ్లుగా వీరు ప్రేమలో ఉన్నా ఎప్పుడూ కెమెరా కంటికి చిక్కలేదు. ఒక్కసారిగా కీర్తి పెట్టిన పోస్టుతో ఈ ఇద్దరి బంధం గురించి ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.
అయితే గతంలోనే కీర్తి పెళ్లి గురించి రకరకాల రూమర్స్ వచ్చాయి. అయితే వాటిని ఆమెతో పాటు తన ఫ్యామిలీ ఖండించారు. ఆ తర్వాత ఆంటోనీ పేరు తెగ ట్రెండ్ అయ్యింది. తన స్నేహితుడితో ఆమె ఏడడుగులు వేయనున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ఇటీవల కీర్తి తండ్రి తమ కుమార్తె పెళ్లి గురించి త్వరలోనే చెప్తామని వెల్లడించడంతో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. ఇంజినీరింగ్ చదివిన ఆంటోనీ కొంతకాలం విదేశాల్లో ఉద్యోగం చేశారు. ప్రస్తుతం ఆయన కేరళలో బిజినెస్ చేస్తున్నారని సమాచారం.








