Mana Enadu : శబరిమల (Sabarimala)ను దర్శించుకునే అయ్యప్ప భక్తులకు కేరళ పోలీసులు తీపికబురు అందించారు. మండలం-మకరవిళక్కు వార్షిక యాత్ర సందర్భంగా శబరిమల వస్తున్న యాత్రికులు సులభంగా స్వామి దర్శనం చేసుకునేందుకు వీలుగా ఓ ప్రత్యేక పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ‘శబరిమల పోలీస్ గైడ్ (Sabarimala Police Guide)’ అనే ఈ పోర్టల్‌లో భక్తులకు ఉపయోగపడే ముఖ్యమైన సమాచారాన్ని పొందుపరించారు. ఈ పోర్టల్ ఇంగ్లీష్ భాషలో అందుబాటులో ఉంది.
శబరిమల చరిత్రతో పాటు ఆ సమాచారం
ఇక ఇందులో పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్లు, పోలీస్ స్టేషన్ ఫోన్ నంబర్లు, ఆరోగ్య సేవలు, కేఎస్ ఆర్టీసీ, అంబులెన్సు, అగ్నిమాపక దళం, ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన సమాచారం పొందుపరించారు. వీటితో పాటు శబరిమల చరిత్ర (Sabarimala History), ప్రతి జిల్లా నుంచి శబరిమలకు ఉన్న విమాన, రైలు, రోడ్డు మార్గాల వివరాలు, వాహనాల పార్కింగ్ వివరాలు అందుబాటులోకి తీసుకొచ్చారు.
శబరిమలకు 28 రైళ్లు
మరోవైపు శబరిమల వెళ్లే యాత్రికుల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి తాజాగా 28 రైళ్లు (Sabarimala Train Details) నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని కాచిగూడ నుంచి కొట్టాయం, మౌలాలి నుంచి కొల్లం; ఏపీలోని కాకినాడ టౌన్ నుంచి కొల్లం, నర్సాపుర్ నుంచి కొల్లంకు ఈ రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. డిసెంబర్ 11వ తేదీ నుంచి జనవరి 29వ తేదీ వరకు నిర్ణీత తేదీల్లో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈ రైళ్లకు అడ్వాన్సు బుకింగ్స్ శుక్రవారం (డిసెంబర్ 6 ) ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. ..