తెలుగు సినీ ఇండస్ట్రీలో దివంగత అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswara Rao) ఒకరు. టాలీవుడ్(Tollywood) కోసం ఆయన ఎంతో కృషి చేశారు. తెలుగు చలన చిత్ర రంగాన్ని(Telugu film industry) ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో 1976లో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని 22 ఎకరాల్లో అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios)ను నిర్మించారు. అంతకుముందు 1951లో అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్(Annapurna Pictures Private Limited)గా రిజిస్టర్ అయింది. ఒకానొక సమయంలో ఏసినిమా తీయాలన్న తమిళనాడులోని చెన్నై, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ భవిష్యత్తు కోసం నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియో నిర్మాణానికి పూనుకున్నారు. ఇందులో అక్కినేని వెంకట్, నాగార్జున, నాగ సుశీల, సుప్రియ యార్లగడ్డ కీలకంగా వ్యవహరించారు. కాగా అన్నపూర్ణ స్టూడియోస్‌ను నిర్మించి నేటికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ఓ స్పెషల్ వీడియో(Special video) రిలీజ్ చేశారు.
ఎంతో మందికి ఉపాధి కల్పించింది: నాగార్జున
ఈ సందర్భంగా నాగార్జున ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. బండలు, రాళ్లురప్పలున్న చోట తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోకు పునాదులు వేశారని తెలిపారు. సరైన సౌకర్యాలు, వసతులు లేని సమయంలో తన తండ్రి ఈ స్టూడియోస్‌ను ఎలా స్థాపించారో తనకు ఇప్పటికీ అర్థంకావట్లేదన్నారు. కానీ ఒక్క విషయం మాత్రం నిజమని, ఈ స్టూడియో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, కొత్తకొత్త డైరెక్టర్లు, ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌కి ఆపేరు ఎలా వచ్చిందనేది నాగ్ ఈ వీడియో వివరించారు. తన తండ్రి ప్రతి మగాడి విజయం వెనుక తప్పక ఒక స్త్రీ ఉంటుందని గట్టిగా నమ్మేవారని, ఆ ఆలోచనతోనే తన తల్లి అన్నపూర్ణమ్మ(Mother Annapurnamma) పేరును స్టూడియోకి పెట్టారని తెలిపారు. ఎంతో మందికి ANR స్ఫూర్తిగా నిలిచారని నాగ్(Nag) కొనియాడాడు. అన్నపూర్ణ స్టూడియోస్ వార్షికోత్సవం సందర్భంగా నాగార్జున ఇంకేమన్నారో తెలియాలంటే ఈ వీడియో(Video)లో చూసేయండి..







