టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కిరణ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. వరుస సినిమాలతో ప్రేక్షకులను అల్లరిస్తున్నారు కిరణ్ అబ్బవరం. మొదట “రాజా వారు రాణి గారు” సినిమాతో సినిమా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ ఆ తరువాత వచ్చిన “ఎస్ఆర్ కళ్యాణ మండపం(SR Kalyana Mandapam)” సినిమాతో భారీగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్(Box Office) వద్ద సూపర్ హిట్‌గా నిలిచాయి.
సూపర్ హిట్‌ని అందుకున్న “క” మూవీ
ఇకపోతే కిరణ్ చివరగా “క” సినిమాతో సూపర్ హిట్‌ని అందుకున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే కిరణ్ అబ్బవరం ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం K-ర్యాంప్. జైన్స్ నాని(Jains Nani) దర్శకత్వంలో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. యుక్తి తరేజా(Yukti Tareja) కథానాయిక నటిస్తోంది. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులోయిడ్స్ బ్యానర్లపై రాజేశ్ దండ, శివ బొమ్మక్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని అక్టోబర్ 18న థియేటర్లలో విడుదల చేయనున్నారు.

ఇటీవలే ఈ చిత్రం నుంచి విడుదలైన కిరణ్ అబ్బవరం ఫస్ట్ లుక్ పోస్టర్(First Look Poster)కు మంచి స్పందన వచ్చింది. తాజాగా గ్లింప్స్(Glimpse)ను విడుదల చేశారు. చేతన్ భరద్వాజ్(Chetan Bharadwaj) ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా విడుదల అయిన గ్లింప్స్ వీడియోకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌గా స్పందన లభిస్తోంది. మరి ఈ గ్లింప్స్ వీడియో మీరూ చూసేయండి.






