సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) హీరోగా, లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ‘కూలీ(Coolie)’. ఈ సినిమా గురించి తాజా అప్డేట్స్ అభిమానుల్లో జోష్ తెప్పిస్తున్నాయి. సన్ పిక్చర్స్(Sun Pictures) నిర్మాణంలో రూ.375 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో రజినీకాంత్‌తో పాటు నాగార్జున(Nagarjuna), ఉపేంద్ర(Upendra), శృతి హాసన్(Shruti Haasan), సౌబిన్ షాహిర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది. తెలుగు థియేట్రికల్ హక్కులను ఆసియన్ సురేష్ రూ.45 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ అప్డేట్ వచ్చేసింది.

ఆ రూమర్స్‌కి చెక్
గతంలో ట్రైలర్(Trailer) లేకుండానే సినిమా విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ రూమర్స్‌కి చెక్ పెట్టారు మేకర్స్. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ అఫీషియల్‌గా కూలీ ట్రైలర్ రిలీజ్ డేట్(Trailer release date)ని చెప్పేశారు. దీనితో కూలీ చిత్రం ట్రైలర్ ఆగస్టు 2న విడుదల చేయడం కన్ఫర్మ్ అయ్యింది. సో ఆ బిగ్ డే కోసం ఇంకో రెండు వారాలు ఆగాల్సిందే అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్(anirudh) సంగీతం అందిస్తున్నాడు.
#Coolie Trailer on August 2nd 🔥🔥🔥#CoolieTrailer pic.twitter.com/Hx3wQI2thA
— Prathyangira Cinemas (@PrathyangiraUS) July 14, 2025
కూలీ మూవీ రన్ టైమ్ ఎంతంటే..
కాగా ఇప్పటికే విడుదలైన మోనిక వచ్చేసిందే సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక సెకండ్ లిరికల్ సాంగ్(Second lyrical song) వచ్చే వారం విడుదల కానుంది. ఈ చిత్రం రన్‌టైమ్(Run Time) 3 గంటల 3 నిమిషాలుగా లాక్ అయినట్లు సమాచారం. రజినీ, నాగార్జున కాంబినేషన్ సీన్స్ ప్రేక్షకులకు విందు చేయనున్నాయని, ఇండస్ట్రీ హిట్ ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు.







