వాట్సాప్​లో భార్యకు 💋ఎమోజీ పంపిన ఫ్రెండ్.. భర్త ఏం చేశాడంటే?

అనుమానంతో భార్యను చంపిన భర్త, వివాహేతర సంబంధం వల్ల భర్తను హతమార్చిన భార్య.. ఇలాంటి వార్తలు ఇప్పుడు నిత్యకృత్యమయ్యాయి. సోషల్ మీడియా పేట్రేగిపోతున్న నేటి రోజుల్లో చిన్నచిన్న వాటికే ఆత్మహత్యలు, క్షణికావేశంలో హత్యలు (Murders) పెరిగిపోతున్నాయి. ఇక తాజాగా వాట్సాప్ లో ఓ కిస్ ఎమోజీ పెట్టిన చిచ్చు రెండు నిండు ప్రాణాలను బలిగొంది. తన భార్యకు ఆమె స్నేహితుడు కిస్ ఎమోజీ (Kiss Emoji) పంపడం చూసిన భర్త అనుమానంతో ఆ ఇద్దరిని హతమార్చాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది.

అసలేం జరిగిందంటే..?

కేరళలోని పతనంతిట్టలోని కలంజూరులో బైజు, వైష్ణవి దంపతులు నివసిస్తున్నారు. వాళ్ల ఇంటి పక్కనే తల్లితో కలిసి విష్ణు అనే వ్యక్తి ఉంటున్నాడు. విష్ణు, బైజు కలిసి రోజు పనికి వెళ్లేవారు. విష్ణు ఓ సారి వైష్ణవి వాట్సాప్​​కు కిస్ ఎమోజీని పంపాడు. అది బైజు చూశాడు. ఈ విషయంలో ఆమెతో గొడవ పడ్డాడు. కొడవలి పట్టుకుని చంపేందుకు ప్రయత్నించడంతో భయపడిన వైష్ణవి పొరుగింట్లోకి వెళ్లింది.

ఇద్దరినీ నరికేశాడు

వైష్ణవిని బయటకు రమ్మని బైజు కేకలు వేసినా ఆమె వినకపోవడంతో విష్ణు ఇంటి లోపలికి వెళ్లిన బైజు పెరట్లోకి ఆమెను లాక్కెళ్లి నరికేశాడు. ఈ గొడవ ఆపేందుకు ప్రయత్నించిన విష్ణుపై కూడా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన విష్ణు, వైష్ణవిలను స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఇద్దరు మార్గమధ్యలోనే చనిపోయారు. ఈ ఘటన గురించి బైజు స్నేహితుడికి చెప్పడంతో అతడి మిత్రుడు పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *