
సీఎం రేవంత్ రెడ్డి అవినీతి బండారం బట్టబయలు అయిందని నేషనల్ హెరాల్డ్ కేసులో (National Herald case) సీఎం పేరు చేర్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఈడీ నమోదు చేసిన చార్జీషీట్ లో యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభపెట్టాడని ఉందన్నారు. దీంతో రేవంత్ ఏ మేరకు అవినీతి చేశాడో బట్టబయలైందన్నారు.
సీఎం కాకముందే..
ముఖ్యమంత్రి కాకముందే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు వందల కోట్లు కట్టబెట్టిన వ్యవహారం , వేల కోట్ల అవినీతి వల్లే ఈడీ కేసులో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అడ్డంగా ఇరుక్కుపోయారని కేటీఆర్ అన్నారు. సీఎం కుర్చీ ఎప్పుడు పోతుందోనని రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందన్నారు.
30 పర్సంటేజీ లేనిదే…
కమీషన్లు లేనిదే ప్రభుత్వంలో ఒక్క ఫైలు కదలడం లేదని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చెప్పడం కాంగ్రెస్ అవినీతికి పరాకాష్ట అన్నారు. 30 శాతం పర్సంటేజీ ఇవ్వనిదే పనులు కావడం లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (Anirudh Reddy) చెప్పడంతో నిజస్వరూపం బయటపడిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని కేటీఆర్ విమర్శించారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు పెట్టడంతో.. సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడింది.
యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని ఈడీ నమోదు చేసిన చార్జిషీట్ తో సీఎం అవినీతి సామ్రాజ్యం బట్టబయలైంది.
అధికారం కోసం ముఖ్యమంత్రి… pic.twitter.com/fsb8uT8Sc9
— KTR (@KTRBRS) May 23, 2025