‘ఎనుముల వారి ఏడాది ఏలికలో కుంభకోణాల కుంభమేళా’

Mana Enadu : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) విజయోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ఎనుముల వారి ఏడాది ఏలికలో తెలంగాణ బతుకు చీలికలు, పీలికలే అంటూ ధ్వజమెత్తారు. కోలుకోలేని విధ్వంసం సృష్టించి విజయోత్సవాలు జరుపుతారా అని ప్రశ్నించారు. ఇది విజయోత్సవం కాదు, కుంభకోణాల కుంభమేళా అని విమర్శించారు.

కరప్షన్‌ కార్నివాల్‌

“ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీకి పాతరేసినందుకు జరపాల్సింది విజయోత్సవాలు కాదు.. ప్రజావంచన వారోత్సవాలు. మూసీలో రూ.లక్షన్న కోట్ల మూటల వేట, కొడంగల్‌ లిఫ్టు ఇరిగేషన్‌లో రూ.వేల కోట్ల కాసుల వేట, బావమరిదికి అమృత్‌ టెండర్లు, మంత్రుల కుమారులకు రూ.వేల కోట్ల కాంట్రాక్టులు. సీఎం, మంత్రులు చేసుకోవాల్సింది విజయోత్సవాలు కాదు.. కరప్షన్‌ కార్నివాల్‌ (Corruption Carnival). పరిపాలనా వైఫల్యాలకు కేరాఫ్ కాంగ్రెస్‌ సర్కార్. సంక్షోభం తప్ప సంతోషం లేని పాలనకు చిరునామా రేవంత్‌ సర్కార్‌. ఏ ముఖం పెట్టుకుని విజయోత్సవాలు నిర్వహిస్తారు. పేదల ఇండ్లు కూల్చి రోడ్డున పడేసిన కాంగ్రెస్‌ సర్కార్‌కు అసలు మనసే లేదు” అంటూ ఎక్స్‌ వేదికగా మండిపడ్డారు.

ఎనుముల వారి ఏడాది పాలనలో ఏమున్నది 

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీకి పాతరేసిన నేపథ్యంలో జరపాల్సింది విజయోత్సవాలు కాదు అని కేటీఆర్ అన్నారు. ప్రజావంచన వారోత్సవాలు. ఎనుముల వారి ఏడాది పాలనలో చెప్పుకోవడానికి ఏమున్నది గర్వకారణం అంటే.. మూసీ(Musi)లో లక్షన్నర కోట్ల మూటల వేట..! కొడంగల్ లిఫ్టులో వేల కోట్ల కాసుల వేట అని ధ్వజమెత్తారు. బావమరిదికి అమృత్ టెండర్లను, కొడుకులకు వేలకోట్ల కాంట్రాక్టులను కట్టబెట్టే ముఖ్యమంత్రి (Chief Minister), మంత్రులు జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదు.. కరప్షన్ కార్నివాల్ అని ఆరోపించారు.

బాధితులు బాధలో ఉంటే బాజాభజంత్రీలతో పండుగనా?

‘రుణమాఫీ (Runa Mafi) కాక, పెట్టుబడి సాయం అందక పేద రైతులు దుఖంలో ఉంటే మీరు వందల కోట్లతో విజయోత్సవాలు చేసుకుంటారా? హైడ్రా (Hydra), మూసీ బాధితులు బాధలో ఉంటే మీరు బాజాభజంత్రీలతో పండుగ చేసుకుంటారా? ఆడబిడ్డలు రక్షణ లేక అల్లాడుతుంటే మీరు విజయోత్సవాల పేరిట విర్రవీగుతారా?

వృద్ధులు పింఛన్ల పెంపు కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటే మీరు దయలేకుండా దావత్ లు చేసుకుంటారా?  ఈ ముఖ్యమంత్రికి పాలనపై పట్టు కాదు.. ఈ ప్రభుత్వానికి తెలంగాణపై ప్రేమలేదు. పేదల ఇళ్లు కూల్చి రోడ్డున పడేసిన కాంగ్రెస్ సర్కారుకు అసలు మనసే లేదు. విజయోత్సవాలు అంటే ఏంటో కూడా తెలియని ఈ అసమర్థ పాలకులకు ఆ పదాన్ని వాడే హక్కే లేదు.’ అని కేటీఆర్‌ ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *