Mana Enadu : నందమూరి బాలకృష్ణ (Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే (Unstoppable With NBK) సీజన్ 4 ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సీజన్ లో తొలి ఎపిసోడ్ లో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గెస్టుగా వచ్చారు. ఫస్ట్ ఎపిసోడ్ విజయవంతమైన నేపథ్యంలో తాజాగా రెండో ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసింది ఆహా టీమ్.
బాలయ్యతో లక్కీ భాస్కర్
రెండో ఎపిసోడ్ లో బాలయ్యతో సందడి చేసేందుకు ఈ షోకు ‘లక్కీ భాస్కర్ (Lucky Baskhar)’ చిత్రబృందం గెస్టుగా వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) , మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary), డైరెక్టర్ వెంకీ అట్లూరి సందడి చేశారు. తాజాగా వీరితో ఉన్న ప్రోమోను ఆహా టీమ్ రిలీజ్ చేసింది.
ఆటతో పేల్తాయ్.. అన్నీ పేల్తాయ్
ఈ ప్రోమోలో ఈ చిత్రబృందం బాలయ్యతో జాలీగా ముచ్చట్లు పెట్టినట్లు కనిపిస్తోంది. సరదా చిట్‌చాట్, ఆటతో పేల్తాయ్.. అన్నీ పేల్తాయ్.. అంటూ సాగుతున్న ప్రోమో రెండో ఎపిసోడ్(Unstoppable With NBK Second Episode)పై ఆసక్తిని క్రియేట్ చేసింది. ఎంతో సరదాగా సాగిన ఈ ప్రోమోకు సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ అక్టోబర్ 31వ తేదీన దీపావళి కానుకగా రాత్రి 7 గంటలకు స్ట్రీమింగ్ కానుంది.
అక్టోబర్ 31న లక్కీ భాస్కర్ వచ్చేస్తున్నాడు
ఇక లక్కీ భాస్కర్ సినిమా సంగతికి వస్తే వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో అక్టోబర్ 31వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.