Mana Enadu : ‘హను-మాన్’ (Hanuman) మూవీతో ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా పురాణాలు, ఇతిహాసాలకు సంబంధించిన సినిమాలు చేయనున్నట్లు తెలిపాడు. ఇందులో భాగంగా హనుమాన్ కు కొనసాగింపుగా ‘శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేమిటి?’ అనే ప్రశ్నకు సమాధానంగా ‘జై హనుమాన్’ (jai hanuman movie) చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
ఆరోజే జై హనుమాన్ ఫస్ట్ లుక్
తాజాగా ‘జై హనుమాన్’ సినిమా బృందం ఓ అప్డేట్ ను షేర్ చేసింది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను అక్టోబరు 30వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (jai hanuman movie update) ప్రకటించింది. ఈ మూవీలో హనుమంతుడి పాత్రలో ‘కాంతారా’ ఫేమ్ రిషభ్ శెట్టి నటించనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
This Diwali, bringing the legends to life with a tale that rekindles the flames of valor and honors our Indian Itihasas❤️@MythriOfficial @ThePVCU #JAIHANUMAN #NaveenYerneni @mythriravi #PVCU #DIWALIisCOMING pic.twitter.com/sjOFBC5vIV
— Prasanth Varma (@PrasanthVarma) October 29, 2024
వందరెట్లు భారీ స్థాయిలో
ఈ నేపథ్యంలో ఈ సస్పెన్స్ కు తెర దించేందుకు అక్టోబర్ 30వ తేదీన ఫస్ట్‌లుక్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం చెప్పింది. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. మరికొన్ని గంటల్లో ఈ ఉత్కంఠకు మూవీ మేకర్స్ తెర దించనున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో (PVCU) భాగంగా రూపొందుతున్న ఈ సినిమా ‘హను-మాన్’కి మించి వందరెట్లు భారీ స్థాయిలో ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పటికే ప్రకటించాడు.
హనుమాన్ పాత్రలో ఆ హీరో
సీక్వెల్‌లో తేజ సజ్జా (Teja Sajja) హీరో కాదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సీక్వెల్‌లోనూ అతడు హనుమంతు పాత్రలో కనిపిస్తాడని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు. కానీ, ఆ సినిమా హీరో ఆంజనేయ స్వామి అని, ఆ పాత్రను స్టార్ హీరో చేస్తారని తెలిపాడు.
ఇక ఈ మూవీతో పాటు, ‘అధీర’, ‘మహాకాళి (Maha Kali)’ చిత్రాలు కూడా తన సినిమాటిక్ యూనివర్స్‌లో విడుదల కానున్న విషయం తెలిసిందే. మరోవైపు నందమూరి నట వారసుడు, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞను టాలీవుడ్ కు ప్రశాంత్ వర్మ పరిచయం చేస్తున్నాడు.






