నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘మ్యాడ్ స్క్వేర్(Mad Square)’. ‘మ్యాడ్’ (Mad)’ చిత్రానికి సీక్వెల్‌గా డైరెక్టర్ కళ్యాణ్ శంకర్(Director Kalyan Shankar) తెరకెక్కించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ(Suryadevara Nagavamsi) ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 28న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ టాక్‌తోపాటు కలెక్షన్లలోనూ దూసుపోతోంది. ఇటీవల హైదరాబాద్‌లో సక్సెస్ మీట్(Success Meet) కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ బయటికొచ్చింది.
కేవలం తెలుగులోనే స్ట్రీమింగ్
ఇక ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం మేరకు ఈ మూవీ ఏప్రిల్ 25 నుంచే స్ట్రీమింగ్ కానుందని టాక్. అయితే పాన్ ఇండియా భాషల్లో కాకుండా కేవలం తెలుగులోనే ఈ చిత్రం రానున్నట్టుగా టాక్. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా అది అభిమానుల్లో ఫుల్ జోష్ నింపింది.






