చిరంజీవి ఎంట్రీతో ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్‌లో హంగామా.. పవన్ చిరు ఫోటో సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కమిటై ఉన్న సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఓజీ మూవీ షూటింగ్‌ జరుగుతోంది. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) షూటింగ్ పనులను వేగంగా పూర్తి చేయడానికి సిద్ధమవుతున్నారు. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ (Harish Shankar)కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా సినిమా షూటింగ్స్‌కు కట్టుబడి ఉన్న పవన్, ఎన్నికల ముందు కమిట్ అయిన ప్రాజెక్టుల్ని పూర్తి చేసే దిశగా వేగంగా ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu) సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్ ఓ బందిపోటు పాత్రలో మెరిసిపోతుండగా, కథానాయికగా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. అలాగే అర్జున్ రాంపాల్, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, అనసూయ మరియు పూజా పొన్నాడ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇక మరోవైపు దర్శకుడు సుజిత్(Sujith) తెరకెక్కిస్తున్న ఓజీ(OG) సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌తో కొనసాగుతుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను భారీగా ఆకట్టుకోగా, పవన్ కొత్త లుక్‌కి విశేష స్పందన లభించింది. ఇటీవలే ఓజీ షూటింగ్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుండగా, తాజాగా ఈ సెట్స్‌లో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సడన్‌గా విచ్చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు. చిరు, పవన్ కలసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరు మెగా హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, సాక్షి వైద్య, అశుతోష్ రానా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ వంటి నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

 

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *