Free Bus Scheme: ఏపీలో మహిళలకు తీపికబురు.. త్వరలోనే ఫ్రీ బస్ స్కీం అమలు

ఏపీ(Andhra Prdesh)లో మహిళలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్నికల హామీల్లో ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణం స్కీము(Free bus travel scheme)ను సంక్రాంతి తర్వాత అమలు చేయనున్నట్లు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి(Minister Mandipalli Ramprasad Reddy) వెల్లడించారు. విశాఖపట్నంలోని ద్వారకా బస్ స్టేషన్‌(Dwarka Bus Station)లో శుక్రవారం APSRTC డోర్ డెలివరీ సర్వీసును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. త్వరలోనే ఫ్రీ బస్ స్కీమ్ అమలు చేస్తామని చెప్పారు. ప్రయాణికులకు, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు APSRTC ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే కార్గో సర్వీస్‌ను డోర్ డెలివరీ(Door delivery of cargo service) ప్రారంభించినట్లు మంత్రి వ్యాఖ్యానించారు.

మరోవైపు APSRTC దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. CM చంద్రబాబు ఆదేశాలతో కొత్త బస్సుల(New Buses)ను అందుబాటులోకి తెస్తున్నామని.. ఇప్పటికే పలుచోట్ల నూతన బస్సు సర్వీసులు ప్రారంభమైనట్లు చెప్పారు. మరికొద్ది రోజుల్లోనే మరో 500 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి చెప్పారు.

ఫ్రీ బస్ స్కీంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళలు

కాగా TDP కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్(Super Six) హామీల్లో ఇది ఒకటి. దీనిపై CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక ఎన్నికల్లో గెలిచి TDP కూటమి సర్కారు అధికారంలోకి రావటంతో మహిళలు అందరూ ఈ పథకం ఎప్పుడు అమల్లోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్ట్ 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం హామీ అమల్లోకి వస్తుందంటూ ప్రచారం కూడా జరిగింది. కానీ అమల్లోకి రాలేదు. దీంతో ఉచిత బస్సు ప్రయాణం పథకం(Free Bus Scheme) ఎప్పుడు అమలు చేస్తారా అనే దానిపై మహిళలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే RTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై ఏపీ రవాణా శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *