
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే మిస్ వరల్డ్ పోటీలు(Miss Universe Pageant 2025) ముగిశాయి. దాదాపు నెల రోజులపాటు ఉత్కంఠగా సాగిన 72వ మిస్ వరల్డ్(Miss World) పోటీల్లో విశ్వసుందరి కిరీటం థాయిలాండ్‌కు చెందిన అందాల భామ ఓపల్ సుచాత చువాంగ్‌శ్రీ(Opal Suchata Chuangsri)కు దక్కింది. మొత్తం 108 దేశాలకు చెందిన కంటెస్టెంట్లు వివిధ పోటీల్లో 72వ మిస్ యూనివర్స్ కిరీటం(Miss Universe Crown) కోసం పోటీపడ్డారు. ఇక టాప్-4లో సుచాతతోపాటు మార్టినక్, పొలాండ్, ఇథియోపియా దేశాలకు చెందిన సుందరీమణులు ఉన్నారు.
กรี๊ดดังมากกกก มงฟ้ามงแรกของไทย อีกหนึ่งตำนานที่เราสามารถจับใจจูได้แล้ววววว น้องโอปอล์กับตำแหน่ง Miss World 2025 น้องเก่งมากกก #MissWorld #ใต้เตียงดารา pic.twitter.com/g3HMSq81XO
— ใต้เตียงดารา (@UnderbedDara) May 31, 2025
విశ్వసుందరి భావోద్వేగం
వీరిలో ఫస్ట్ రన్నరప్‌గా హాసెట్ డెరెజే అడ్మాను (Ethiopia), సెకండ్ రన్నరప్‌గా మజా క్లాజ్డా (Poland), మూడో రన్నరప్‌గా ఆరేలీ జోచిమ్ (Martinique) నిలిచారు. కాగా మిస్ ఇండియా నందిని గుప్తా(Nandini Gupta) టాప్-8లో కూడా స్థానం దక్కించుకోలేకపోయారు. కాగా ఈ ఏడాది థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాత చువాంగ్‌శ్రీ విజేతగా నిలిచారు. తన పేరును ప్రకటించగానే ఓపల్ సుచాత భావోద్వేగానికి లోనయ్యారు.
ไม่รู้จะแคปตรงไหนเลย น้ำตามันมา ไปพร้อมกับแม่ปุ้ยยยยยย มงฟ้ามงแรกใช่ไหม ? ตำนานมงฟ้ามงแรกของไทยเลยใช่ไหม โอ้ยยย โอปอล เก่งม๊ากกก ประทับใจจู เวลคัมป้าจู!!!!!#MissWorld #MissWorld2025 #MissWorldThailand #MissWorldThailand2025 pic.twitter.com/hhFx87kOwP
— นายกสมาคมคนชอบกินลูกชิ้นปลาพ่อเลี้ยงด่างคอร์กี้ (@dangcorgi) May 31, 2025
సుచాతకు రూ.8.5 కోట్ల ప్రైజ్ మనీ
2025 సంవత్సరానికి గాను ప్రపంచ సుందరి కిరీటాన్ని ఆమె కైవసం చేసుకున్నారు. గత సంవత్సరం (2024) మిస్ వరల్డ్‌గా నిలిచిన క్రిస్టినా పిజ్కోవా(Kristina Pizkova), 72వ ప్రపంచ సుందరి ఓపల్ సుచాత చువాంగ్‌శ్రీకి సంప్రదాయబద్ధంగా కిరీటాన్ని అలంకరించి, శుభాకాంక్షలు తెలిపారు. మిస్ వరల్డ్‌గా ఎంపికైన ఓపల్ సుచాతకు రూ. 8.5 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. ఈ ఈవెంట్‌కు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో పాటు మంత్రులు, సినీ ప్రముఖులు సోనూసూద్(Sonusood), దగ్గుబాటి రానా, చిరంజీవి(Chiranjeevi), విజయ్ దేవరకొండ, నిర్మాత్ దిల్‌రాజు(Dil Raju), నటి నమ్రత, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్(Jacqueline Fernandez), మిస్‌వరల్డ్ కంటెస్టెంట్స్, వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.