‘‘అక్కడ..
పారుతున్నది నీళ్లు కాదు
విషపూరిత ఆనవాళ్లు.
అక్కడ..
వీస్తున్నది స్వచ్ఛమైన గాలి కాదు..
భరించలేని దుర్గంధం.
చెట్టు చెలమ..
మట్టి మనిషి..
పశువు.. పక్షి..
సమస్త ప్రకృతి జీవచ్ఛవమైంది.
అందుకే..
సంగెం శివయ్య ఆనగా..
మూసీ ప్రక్షాళనకు సంకల్పం తీసుకున్నా.’’
అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ నది కాలుష్యంపై ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా మూవీ నది, పాదయాత్రకు సంబంధించిన ఓ అద్భుత వీడియోను సీఎం షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇందుకోసమే మూసీ ప్రక్షాళన
అసలు ఈ కార్యక్రమానికి ఎందుకు పూనుకున్నారో సీఎం వివరించారు. కాగా శుక్రవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి(Yadagirigutta Lakshminarasimhaswamy)ని CM కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం మూసీ నది పునరుజ్జీవన సంకల్ప యాత్ర(Musi River Revival Expedition)ను సంగెం నుంచి చేపట్టారు. ఈ సందర్భంగా ముందుగా మూసీనదికి పూలుజల్లి హారతి ఇచ్చారు. అనంతరం మూసీ నది కుడి ఒడ్డున భీమలింగం వరకు దాదాపు 2.5KM పాదయాత్ర చేశారు. ధర్మారెడ్డిపల్లి కెనాల్ కట్ట వెంట సంగెం- నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు చేపట్టిన ఈ యాత్రలో రేవంత్ మూసి పరీవాహక ప్రాంత తీరుతెన్నులను పరిశీలించారు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారితో ఆయన మాట్లాడారు.
మరో 30 రోజుల్లో తుదిరూపం
మూసీ ప్రక్షాళనకు కొంత మంది దుర్మార్గులు అడ్డొస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) మండిపడ్డారు. ఎవరు అడ్డు వచ్చినా మూసీ ప్రక్షాళన ఆగదని తేల్చి చెప్పారు. మూసీ నది పరిసర ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు, రైతులు మూసీ కాలుష్యంతో దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యం, పంటల పరంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. వీరితోపాటు సంగెం నుంచి బొల్లంపల్లి వరకు కూడా మూసీ నది పరిసర ప్రాంతాల ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో 30 రోజుల్లో తుదిరూపం తీసుకొస్తామని సీఎం స్పష్టం చేశారు.
అక్కడ…
పారుతున్నది నీళ్లు కాదు…
విషపూరిత ఆనవాళ్లు.
అక్కడ…
వీస్తున్నది స్వచ్ఛమైన గాలి కాదు…
భరించలేని దుర్గంధం.చెట్టు చెలమ…
మట్టి మనిషి…
పశువు పక్షి…
సమస్త ప్రకృతి జీవచ్ఛవమైంది.అందుకే…
సంగెం శివయ్య ఆనగా…
మూసీ ప్రక్షాళనకు సంకల్పం తీసుకున్నా.#MusiRiver pic.twitter.com/jPNycSXajS— Revanth Reddy (@revanth_anumula) November 9, 2024