నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా డైరెక్టర్ బాబీ(Bobby) కాంబోలో వచ్చిన మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj). సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.150 కోట్ల గ్రాస్ వసూల్ చేసి రికార్డు సాధించింది. ఈ మూవీలో శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) హీరోయిన్స్‌గా నటించిన ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా(Urwashi Routela) ఓ స్పెషల్ సాంగ్‌తో దుమ్ముదులిపింది. తమన్(Taman) మ్యూజిక్ అందించగా.. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. తాజాగా ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ మీట్(Grand Success Meet) APలోని అనంతపురం జిల్లాలో గ్రాండ్‌గా నిర్వహించారు.
బాలయ్యకు కోపం వస్తే అక్కడే తిట్టేస్తారు: మోహన్
అనంతపురంలోని శ్రీనగర్ కాలనీలో ఈ ఈవెంట్ నిర్వహించారు. వాస్తవానికి అనంతపురంలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకోవాలని మూవీ టీమ్ ముందుగా భావించింది. కానీ అప్పుడే తిరుమల తొక్కిసలాట జరగడంతో వెనక్కి తగ్గింది. ఇక ఇప్పుడు సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఈ మూవీ రైటర్ మోహన్(Mohan) మాట్లాడుతూ.. బాలకృష్ణతో పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆయనతో పనిచేయడం వల్ల ఓ సీక్రెట్‌ను కనిపెట్టానని, అందరికీ కోపం వస్తే దాన్ని మనసులో పెట్టుకుంటారని, బాలయ్యకు కోపం వస్తే అక్కడికక్కడే తిట్టేసి.. ఆ బరువు దించుకుంటారని చెప్పారు.
అఖండ-2 మామూలుగా ఉండదు: తమన్
ఇక తమన్(Taman) మాట్లాడుతూ.. డాకు మహారాజ్‌ను ఇంత సక్సెస్ చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘‘ఇక బాలయ్య నటిస్తోన్న అఖండ-2 మామూలుగా ఉండదు. అభిమానులందరూ ముందే ప్రిపేర్ అయిపోండి. ఇంటర్వెల్‌కే డబ్బులన్నీ ఇచ్చేయొచ్చు. సెకండాఫ్ అంతా బోనస్’’ అని తమన్ పేర్కొన్నారు. అనంతరం బాలయ్య తమన్ కోరిక మేరకు ‘గణ గణ గణ.. ఆంధ్ర తెలంగాణ’ అనే సాంగ్‌ను పాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ.. బాలయ్యను తొలిసారి కలినప్పుడే ఆయన ఎంతో ఆప్యాయంగా మాట్లాడారో ఇప్పుటికీ అలాగే నన్ను ఆశీర్వదిస్తారు. ఆయనకు చాలా కోపం అని చాలా మంది అంటుంటారు. కానీ దాని వెనుక ఆయన క్యారెక్టర్ ఏంటో చాలా మందికి తెలియదు. ఆయన మాటిస్తే ఎన్ని అవరోధాలు ఎదురైనా దాన్ని నెరవేరుస్తారని చెప్పారు.
ఎంతో తపన పడి సినిమా చేస్తా: బాలకృష్ణ
చివరగా బాలకృష్ణ(Balakrishna) మాట్లాడుతూ.. దేశానికి రాయలసీమ ఓ రాష్ట్రపతిని ఇచ్చిందని గుర్తుచేశారు. ఎంతో మంది రాజకీయ, సినీ ప్రముఖులకు నిలయంగా ఉందన్నారు. ఇది రాయల సీమ కాదు.. రాయల్ సీమ అని అన్నారు. డాకు మహారాజ్(Daaku Maharaaj)ను ఇంతపెద్ద హిట్ చేసిన ప్రతిఒక్కరి పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. ఎంతో రీసెర్చ్ చేసి, ఎంతో తపన పడి సినిమా చేస్తామని చెప్పారు. డాకు అంటే దొంగ అని.. అది బాలకృష్ణ అని బాలయ్య అంటే అభిమానుల మనసు దొంగిలించే దొంగని అన్నారు. నా చివరి ఊపిరి వరకు, వైవిధ్యమైన పాత్రలతో సినిమాలు చేస్తానని బాలయ్య చెప్పుకొచ్చారు. నా వ్యక్తిత్వమే నా ధైర్యమని అన్నారు. నేను దేని గురించి అంతగా పట్టించుకోనని.. అభిమానులే(Fans) తన నిజమైన ప్రచాకర్తలని అన్నారు. కాగా ఈ ఈవెంట్‌కు భారీగా నందమూరి అభిమానులు హాజరయ్యారు.







