బాలయ్య(Balayya)-బాబీ(Bobby) కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్(Daaku Maharaaj)’ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), శ్రద్ధా శ్రీనాథ్(Shraddha Srinath) హీరోయిన్లుగా నటిస్తున్నారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా ప్రీరిలీజ్ ఈవెంట్(Pre Release Event)ను శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని ITC కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మూవీ యూనిట్‌తోపాటు MP భరత్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలయ్య(Balakrishna) మాట్లాడారు. ముందుగా తిరుపతిలో చోటుచేసుకున్న ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. అందుకే అనంతపురంలో నిర్వహించాల్సిన ప్రీరిలీజ్ ఈవెంట్(Pre Release Event)ను రద్దు చేసినట్లు తెలిపారు. తిరుపతి తొక్కిసలాటలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు బాలయ్య చెప్పారు.
డాకు మహారాజ్‌తో మరో కొత్త ప్రపంచాన్ని చూస్తారు
ఇక డాకు మహారాజ్(Daaku Maharaaj) మూవీ ఫ్యామిలీతో కలిసి చూడవల్సిన చిత్రం అని బాలయ్య అన్నారు. దబిడి దిబిడి సాంగ్ ఇంత హిట్ అయిందంటే అభిమానులే కారణమని చెప్పుకొచ్చారు. డాకు మహారాజ్‌తో మరో కొత్త ప్రపంచాన్ని చూస్తారని, హీరోయిన్లు ఊర్వశీ రౌటేలా(Urvashi Rautela), శ్రద్ధా శ్రీనాథ్ అద్భుతంగా నటించారని కొనియాడారు. సినిమాను కూడా అంతే హిట్ చేస్తారని ఆశిస్తున్నా’’ అని బాలకృష్ణ అన్నారు. ‘అఖండ 2(Akhanda2)’ మూవీ తర్వాత ఇండస్ట్రీకి తన విశ్వరూపం చూపిస్తానని సినీనటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆ తర్వాత వచ్చే సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయని చెప్పారు. ఇక అంతకుముందు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్, డైరెక్టర్ బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడారు. బాలయ్య ఏమేం మాట్లాడారో ఈ వీడియోలో చూసేయండి..







