నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram), లేడీ సూపర్ స్టార్ విజయశాంతి(Vijaya Shanthi) ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి(Arjun S/o Vyjayanthi). ప్రదీప్ చిలుకూరి(Pradeep Chilukuri) దర్శకత్వం వహించిన ఈ సినిమాని అశోకా క్రియేషన్స్, NTR ఆర్ట్స్ బ్యానర్లపై కళ్యాణ్ రామ్‌తో కలిసి అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బలుసు కలిసి నిర్మించారు. కత్తి మూవీ తర్వాత NKR చాలా గ్యాప్ తర్వాత ఒక మాస్ మసాలా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సాయీ మంజ్రేకర్(Saiee Manjrekar) ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన ఈ మూవీ భారీ అంచనాలతో ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
Blockbuster talk from overseas 🔥🔥🔥
After a Long Time #KalyanRam in a POLICE ROLE Literally GOOSEBUMPS Feel 🔥🔥🔥🔥🔥
Congratulations anna @NANDAMURIKALYAN ❤️🔥🔥#ArjunSonofVyjayanthi
— Sonu Reddy (@SonuReddy9999) April 17, 2025
మొదటి షో నుంచి టాక్ పాజిటివ్ రెస్పాన్స్
మొదటి షో నుంచి టాక్ పాజిటివ్ గానే ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మూవీని చూసిన నెటీజన్స్ సోషల్ మీడియా(SM) ద్వారా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. అటు US ప్రీమియర్ల తర్వాత నెటిజన్లు, అభిమానులు సోషల్ మీడియాలో వెల్లడించిన రివ్యూలు(Reviews), అభిప్రాయాలు పాజిటివ్‌గానే ఉన్నాయి. మొత్తానికి కళ్యాణ్ రామ్ కమ్ బ్యాక్ ఇచ్చాడని నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. పబ్లిక్ రివ్యూ ఎలా ఉందంటే..?
First Half 💥💥💥💥💥💥💥💥
Intro + First Song + Interval Block Instant High
Unexpected Action Packed Racy@NANDAMURIKALYAN Screen Presence 🥵 #ArjunSonOfVyjayanthi 👍 pic.twitter.com/CyTjYd7K1n
— Naveen Chowdary Kosaraju (@AlwaysNachoMan2) April 18, 2025
బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడం పక్కా..
నందమూరి అభిమానులకు ఇది మాస్ ట్రీట్.. ఈ సినిమా హిట్ కావడం తథ్యం. ఇంటర్వెల్, క్లైమాక్స్ ఈ సినిమాకు బలంగా నిలవడమే కాకుండా అదరగొట్టేలా ఉంటాయని ఓ నెటిజెన్ కామెంట్ చేశాడు. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడం పక్కా.. తల్లి కొడుకుల సెంటిమెంట్‌తో పాటుగా పవర్ ఫుల్ పోలీసు యాక్షన్ సన్నివేశాలు(Actions Scenes) గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. సూపర్ హిట్ అని ఒకరు ట్వీట్ చేశారు. మళ్లీ చాలా రోజుల తర్వాత లేడీ సూపర్ స్టార్ విజయశాంతిని చూడటం చాలా సంతోషంగా ఉందని హీరో సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు.






