నేచురల్ స్టార్ నాని (Nani) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్ది : థర్డ్ కేసు (HIT-3)’. హిట్ ఫ్రాంఛైజీలో వస్తున్న ఈ మూడో సినిమాకు శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ చూస్తే ఇందులో నాని మోస్ట్ వయోలెంట్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక మొదటి రెండు పార్టుల కంటే మూడో భాగంలో హింస, రక్తపాతం విపరీతంగా ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే తెలిసిపోతోంది.
వాళ్లకు నో ఎంట్రీ
శ్రీనిధి శెట్టి హీరోయిన్(Srindihi Shetty)గా నటించిన ఈ సినిమా మే1వ తేదీన విడుదల కానుంది. మరో వారం రోజుల్లో రిలీజ్ కాబోతున్న దృష్ట్యా మేకర్స్ ప్రమోషన్స్ లో జోరు పెంచారు. మరోవైపు ఇటీవలే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. హిట్-3 (HIT : The 3rd Case)కి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇందులో హింస, రక్తపాతం, వైలెన్స్ ఎక్కువగా ఉండటంతో ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలిపింది. అలాగే 13 ఏళ్ల వయసు కంటే తక్కువ ఉన్న పిల్లలు ఈ సినిమాకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది.
దయచేసి మీరు రావొద్దు
నాని స్వయంగా నిర్మిస్తున్న సినిమా కావడంతో ప్రమోషన్స్ లో జోరు చూపిస్తున్నాడు. ఇక ఇప్పటికే తన అన్ని సినిమాల్లాగా ఈ మూవీ ఉండదని.. ఫ్యామిలీ ఆడియెన్స్, చిన్నపిల్లలు ఈ చిత్రానికి దూరంగా ఉండటమే బెటర్ అని నాని ప్రేక్షకులకు సూచించిన విషయం తెలిసిందే. హింస, రక్తపాతాన్ని చూసి తట్టుకోగలిగే వారే తమ సినిమాకు రావాలని కోరారు. ఇక ఈ మూవీలో నాని అర్జున్ సర్కార్ (Arjun Sarkar On Duty) అనే రుత్ లెస్ పోలీసు ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.






