టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీల్లో సూపర్ హిట్ సినిమాలు చేసిన లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) ఇటీవల ‘జవాన్’ మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇప్పుడు శాండల్ వుడ్లోనూ తన సత్తా చూపేందుకు రెడీ అవుతోంది. కన్నడ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్ (Yash)’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నయనతార కూడా నటిస్తోందని ఇటీవలే మరో నటుడు అక్షయ్ ఒబెరాయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
‘టాక్సిక్’లో నయనతార
అయితే ఇందులో యశ్ (Yash) సరసన నయనతార నటిస్తుందని అంతా భావించారు. ఈ అమ్మడు పాత్రను కన్ఫామ్ చేసినట్లు ఫిక్స్ అయ్యారు. అయితే అందరూ భావిస్తున్నట్లు టాక్సిక్ మూవీలో నయన్ ఓ భాగమైనట్లే సమాచారం. కానీ యశ్ సరసన హీరోయిన్ గా మాత్రం కాదట. ఈ చిత్రంలో యశ్ కు చెల్లెలిగా నయనతార నటించనున్నట్లు తెలిసింది. ఇక మెయిన్ లీడ్ గా మొదట కరీనా కపూర్ పేరు వినిపించినా ఆ తర్వాత ఆ వార్తలు చల్లబడ్డాయి.
టాక్సిక్ హీరోయిన్ ఎవరంటే?
ఇక తాజాగా టాక్సిక్ మూవీలో హీరోయిన్లుగా బాలీవుడ్ బ్యూటీస్ తారా సుతారియా లేదా కియారా అడ్వాణీ (Kiara Advani) నటించనున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే వరుస సినిమాలతో దూసుకెళ్తున్న నయనతార రాకింగ్ స్టార్ యశ్ కు సిస్టర్ గా నటించడం ఏంటని పలువురు నెటిజన్లు అంటున్నారు. ప్రస్తుతం నయన్ చేతిలో ఏడు ప్రాజెక్టులున్నాయి. టెస్ట్, మన్నాన్ గట్టి సిన్స్ 1960, డియర్ స్టూడెంట్స్, టాక్సిక్ తో పాటు మరికొన్ని చిత్రాలకు కమిటయ్యింది.







