పాపికొండలు టూర్ కు వెళ్లాలనుకుంటున్నారా?.. ఈ ప్యాకేజీ మీ కోసమే

Mana Enadu : వానాకాలంలో విహార యాత్రలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇక ఈ యాత్రలకు ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి వెళ్లే మజా మామూలుగా ఉండదు. ఇక గోదారమ్మ ఒడిలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ పాపికొండల టూర్(Papikondalu Tourism) కు అలా జాలీగా వెళ్తే లైఫ్ లో ప్రాబ్లెమ్స్ అన్ని క్షణంపాటు మరిచిపోవాల్సిందే. ఈ టూర్ ప్రతి ఒక్కరి లైఫ్ లో ఓ మధురానుభూతిగా మిగిలిపోవాల్సిందే.

అయితే పాపికొండలు విహారయాత్రను ఈ ఏడాది జులై నుంచి నిలిపేసిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీ సర్కార్(AP Govt) ఈ విహార యాత్రను తిరిగి ప్రారంభించింది. మరి మీరు కూడా ఈ వీకెంట్ లో మీ ఫ్యామిలీతో అయినా.. ఫ్రెండ్స్ తో అయినా పాపికొండలు టూర్ కు వెళ్లాలనుకుంటున్నారా..? తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి దేవీపట్నం మీదుగా పాపికొండల మధ్య గోదావరిలో బోట్ రైడ్(Godavari Boat Ride) చేస్తూ ప్రకృతిలో జాలీగా గడిపే ఈ యాత్రకు వెళ్లేందుకు టూర్ ప్యాకేజీని ఇలా బుక్ చేసుకోండి.

పాపికొండలు టూర్ ప్యాకేజీ ఇదే

https://tourism.ap.gov.in/tours , www.aptourismrajahmundri.com వెబ్ సైట్లలో ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. లేదా.. రాజమండ్రి నుంచి ప్రైవేట్ బోట్ ట్రిప్ లు అందుబాటులో ఉంటాయి. రాజమండ్రి నుంచి గండిపోచమ్మ టెంపుల్ వరకు వాహనాల్లో వెళ్లి.. అక్కడి నుంచి 75 కిలోమీటర్లు లాంచీల్లో గోదావరిలో ప్రయాణించాలి. ఇక పాపి కొండల(Papikondalu)కు చేరుకున్న తర్వాత కాసేపు అక్కడ గడిపి ఆ తర్వాత బోటులో తిరిగి గండిపోచమ్మ టెంపుల్​కి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి రాజమండ్రికి తిరుగు పయనమవుతారు.

ఈ టూర్ ప్యాకేజీ ధర(Papikondalu Tour Package) ఒక్కో వ్యక్తికి వెయ్యి రూపాయలు అవుతుంది. ఈ టూర్​లో భాగంగా.. పాపికొండలు, పేరంటాలపల్లి ఆశ్రమం, ఆలయం, పోలవరం ప్రాజెక్ట్, దేవీపట్నం, కొరుటూరు కాటేజీలు, కొల్లూరు వెదురు గుడిసెలు వంటి అనేక ప్రాంతాలు వీక్షించొచ్చు. 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *