Mana Enadu : కీర్తి సురేశ్ (Keerthy Suresh).. ‘నేను శైలజ’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన భామ మహానటి సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ సినిమాతో కీర్తి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక వరుసగా టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇటీవేల ‘బేబీ జాన్’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీకి కూడా రెడీ అయిపోయింది. ఇటీవలే ‘రఘు తాత’ (Raghu Thatha) అనే మూవీతో అలరించిన కీర్తి ఆ సినిమా తర్వాత తన నెక్స్ట్ చిత్రాలపై ఫోకస్ పెట్టింది.
రివాల్వర్ రీటా టైటిల్ టీజర్
ఇవాళ కీర్తి సురేశ్ పుట్టిన రోజు. ఈ భామ బర్త్ డే సందర్భంగా తన లేటెస్ట్ మూవీ ‘రివాల్వర్ రీటా(Revolver Rita)’ నుంచి ఓ కొత్త అప్డేట్ వచ్చింది. ఈ మూవీ మేకర్స్ సినిమా టైటిల్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ వీడియోలో ఓ మార్కెట్ లో కీర్తి భుజానికి బ్యాగ్ వేసుకుని నిల్చొని ఉండగా.. కొందరు దొంగలు ఆమె బ్యాగ్ కొట్టేస్తారు. ఓ ప్రాంతానికి వెళ్లి ఆ బ్యాగులో ఏమున్నాయో ఓపెన్ చేసి చూసి షాక్ అవుతారు. ఇంతకీ అందులో ఏముంటాయంటే..?
పోలీస్.. ఏజెంట్.. డాన్
ఒక గన్, రక్తంతో తడిసిన కత్తి, ఓ బాంబు ఉంటాయి. ఇదేంటని వాళ్లు షాక్ లో ఉన్నప్పుడుగా వాళ్లున్న డెన్ షెటర్ ఓపెన్ అయి గన్ సౌండ్ వస్తుంది. చూస్తే.. ఒకతడిని కీర్తి సురేశ్ షూట్ చేసినట్లు కనిపిస్తుంది. ఇక ఆమెను చూసి వాళ్లు భయపడి మీరు.. పోలీసా.. సీక్రెట్ ఏజెంటా.. డాన్ ఆ అని అడుగుతారు. దానికి కీర్తి సమాధానం ఇచ్చేలోగానే.. ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఫాస్ట్ గా రన్ అయినట్లు చూపించారు. ఈ టీజర్ చాలా ఆసక్తిగా కనిపిస్తోంది. అనుకోని పరిస్థితుల్లో కీర్తి రివాల్వర్ చేత పట్టుకోవాల్సి వస్తుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది.
హ్యాపీ బర్త్ డే కీర్తి
ఇక రివాల్వర్ రీటా మూవీ సంగతికి వస్తే ఈ సినిమాను కన్నడ దర్శకుడు చంద్రు(Director Chandru) తెరకెక్కిస్తున్నాడు. ది రూట్, ప్యాషన్ స్టూడీయోస్ బ్యానర్‌లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం కీర్తి సురేశ్ రివాల్వర్ రీటా టీజర్ బాగా వైరల్ అవుతోంది. ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేస్తోందని నెటిజన్లు అంటున్నారు. కీర్తికి హ్యాపీ బర్త్ డే తో పాటు ఆల్ ది బెస్ట్ కూడా చెబుతున్నారు.