Mana Enadu : వానాకాలంలో విహార యాత్రలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇక ఈ యాత్రలకు ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి వెళ్లే మజా మామూలుగా ఉండదు. ఇక గోదారమ్మ ఒడిలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ పాపికొండల టూర్(Papikondalu Tourism) కు అలా జాలీగా వెళ్తే లైఫ్ లో ప్రాబ్లెమ్స్ అన్ని క్షణంపాటు మరిచిపోవాల్సిందే. ఈ టూర్ ప్రతి ఒక్కరి లైఫ్ లో ఓ మధురానుభూతిగా మిగిలిపోవాల్సిందే.
అయితే పాపికొండలు విహారయాత్రను ఈ ఏడాది జులై నుంచి నిలిపేసిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీ సర్కార్(AP Govt) ఈ విహార యాత్రను తిరిగి ప్రారంభించింది. మరి మీరు కూడా ఈ వీకెంట్ లో మీ ఫ్యామిలీతో అయినా.. ఫ్రెండ్స్ తో అయినా పాపికొండలు టూర్ కు వెళ్లాలనుకుంటున్నారా..? తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి దేవీపట్నం మీదుగా పాపికొండల మధ్య గోదావరిలో బోట్ రైడ్(Godavari Boat Ride) చేస్తూ ప్రకృతిలో జాలీగా గడిపే ఈ యాత్రకు వెళ్లేందుకు టూర్ ప్యాకేజీని ఇలా బుక్ చేసుకోండి.
పాపికొండలు టూర్ ప్యాకేజీ ఇదే
https://tourism.ap.gov.in/tours , www.aptourismrajahmundri.com వెబ్ సైట్లలో ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. లేదా.. రాజమండ్రి నుంచి ప్రైవేట్ బోట్ ట్రిప్ లు అందుబాటులో ఉంటాయి. రాజమండ్రి నుంచి గండిపోచమ్మ టెంపుల్ వరకు వాహనాల్లో వెళ్లి.. అక్కడి నుంచి 75 కిలోమీటర్లు లాంచీల్లో గోదావరిలో ప్రయాణించాలి. ఇక పాపి కొండల(Papikondalu)కు చేరుకున్న తర్వాత కాసేపు అక్కడ గడిపి ఆ తర్వాత బోటులో తిరిగి గండిపోచమ్మ టెంపుల్కి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి రాజమండ్రికి తిరుగు పయనమవుతారు.
ఈ టూర్ ప్యాకేజీ ధర(Papikondalu Tour Package) ఒక్కో వ్యక్తికి వెయ్యి రూపాయలు అవుతుంది. ఈ టూర్లో భాగంగా.. పాపికొండలు, పేరంటాలపల్లి ఆశ్రమం, ఆలయం, పోలవరం ప్రాజెక్ట్, దేవీపట్నం, కొరుటూరు కాటేజీలు, కొల్లూరు వెదురు గుడిసెలు వంటి అనేక ప్రాంతాలు వీక్షించొచ్చు.