
పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చిన్నకుమారుడికి గాయాలయ్యాయి. సింగపూర్(Singapore)లో ఉంటున్న పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్(Mark Shankar) స్కూలులో జరిగిన అగ్నిప్రమాదం(fire accident)లో గాయపడ్డాడు. ఈ ఘటనలో శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అలాగే అతడి ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో శంకర్‌ను స్కూలు యాజమాన్యం హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సింగపూర్ వెళ్లనున్న పవన్..
ఇదిలా ఉండగా పవన్ ప్రస్తుతం అల్లూరి జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ విషయం తెలియడంతో అధికారులు పర్యటన ఆపేసి సింగపూర్ వెళ్లాలని సూచించారు. అయితే ‘అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని, కాబట్టి ఆ గ్రామానికి వెళ్లి ప్రజలతో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకొంటానని, అక్కడి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి వెళ్తాను’ అని పవన్ స్పష్టం చేశారు. కాగా మన్యంలో పర్యటన ముగించుకొని పవన్ విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్తారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
*స్కూల్లో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న శ్రీ పవన్ కల్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్*
•చేతులు, కాళ్ళకు గాయాలు… ఆసుపత్రిలో చికిత్స
•మన్యంలో పర్యటన ముగిసిన తరవాత శ్రీ పవన్ కల్యాణ్ గారు సింగపూర్ పయనంరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్…
— L.VENUGOPAL🌞 (@venupro) April 8, 2025