
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న రియాలిటీ షో బిగ్‌బాస్(Bigg Boss). ఇప్పటికే తెలుగులో 8 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో, ఇప్పుడు తొమ్మిదో సీజన్(Bigg Boss 9th Season)తో మన ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ షోకి సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయని, కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ(Contestants selection process) కూడా మొదలైందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎవరు అడుగుపెట్టబోతున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈసారి హోస్ట్ ఎవరు?
కాగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి సెలబ్రిటీల(Celebrities)ను రంగంలోకి దించాలని నిర్వాహకులు భావిస్తున్నట్లు సమాచారం. అయితే బిగ్‌బాస్ సీజన్-9లో పాల్గొనబోయే కంటెస్టెంట్ల పేర్లు అంటూ ఓ జాబితా సోషల్ మీడియా(SM)లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉండగా ఈసారి హోస్ట్‌గా ఎవరు చేస్తారనేది కూడా ఆసక్తిగా మారింది. గత సీజన్లో నాగార్జునపై విమర్శలు రావడంతో ఈసారి కొత్త హోస్టు వచ్చే అవకాశమూ లేకపోలేదు.
సోషల్ మీడియా జాబితాలో ఉంది వీరే..
ఈ జాబితా ప్రకారం ‘My Village Show’ ద్వారా గుర్తింపు పొందిన అనిల్ గీల, సీరియల్ నటి కావ్య, నటి రీతూ చౌదరి(Ritu Chaudhary), ప్రదీప్ అనే పేరుతో ఒకరు, నటుడు శివ కుమార్, ‘బ్రహ్మముడి’ సీరియల్ ఫేమ్ దీపిక, ‘జబర్దస్త్’ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు సీరియల్ నటుడు సీతాకాంత్, నటి ప్రియాంక జైన్ ప్రియుడిగా చెబుతున్న శివ కుమార్, యూట్యూబర్ అలేఖ్య (చిట్టి పికిల్స్), నటుడు అమర్ తేజ్ భార్య తేజస్విని గౌడ, సీరియల్ నటి దేబ్జాని, ‘Kerintha’ సినిమా హీరో సుమంత్ అశ్విన్, అలాగే సీరియల్ నటులు హారిక, ఏక్‌నాథ్‌లు కూడా ఈ జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ జాబితాపై బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
The buzz for ‘Bigg Boss 9’ has begun! #BigBoss9 #BiggBoss9Telugu #BiggBossContestants https://t.co/0kX13j0FoR
— Telugu70mm (@Telugu70mmweb) June 22, 2025