Mukesh Ambani: AIకి బానిస కావొద్దు.. ముకేశ్ అంబానీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

చైనా రూపొందించిన కొత్త AI మోడల్ ‘డీప్‌సీక్(Deepseek)’ పెనుగుండంగా మారిన సమయంలో ప్రముఖులు చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. అమెరికా(America) ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ, AI విభాగంలో చైనా ముందుకు దూసుకెళ్లడం గమనార్హం. దీంతో వరల్డ్ మొత్తం కూడా ఇప్పుడు చైనా వైపు చూస్తోంది. దీనిపై తాజాగా భారత వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ(Mukesh Ambani) స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోను AI కి మాత్రం బానిసగా మరవద్దని సూచించారు.

గుజరాత్‌(Gujarat)లోని పండిట్ దీన్ దయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ (PDEU) స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, అయితే, సొంత తెలివితేటలను మరవరాదని చెప్పారు. AI ఆధారంగా ఎదిగే తరం, స్వతంత్ర ఆలోచనలను వదులుకోకుండా ముందుకు సాగాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు.

మన మేధస్సును ఉపయోగించడం మరవొద్దు..

ఇంకా ఏమన్నారంటే.. “AI సాధనంగా ఉపయోగపడుతుందని అంగీకరిస్తున్నాను. కానీ, మన మేధస్సు(Intelligence)ను ఉపయోగించుకోవడం మరచిపోవద్దు. మీరు కాలేజీ పూర్తి చేసుకున్న తర్వాత నిజమైన జీవిత పాఠశాలలో అడుగు పెట్టనున్నారు. అక్కడ ఉపాధ్యాయులు(Teachers) ఉండరు, మీరు నేర్చుకునేది మీ సొంత అనుభవాల ద్వారా మాత్రమే” అని పేర్కొన్నారు. ముకేశ్ అంబానీ వ్యాఖ్యలు ప్రస్తుతం AIపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చలకు సంబంధించి మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Related Posts

నిరసనలకు పిలుపు.. వరుసగా బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్టు

Mana Enadu : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల అరెస్టులను ఖండిస్తూ ఆ పార్టీ (BRS) నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్ ఎన్టీఆర్‌ మార్గ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపేందుకు నేతలు సిద్ధమైన క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో మాజీ…

మహారాష్ట్ర సీఎంగా ఫడణవీస్ ప్రమాణం.. డిప్యూటీలుగా శిందే, పవార్

Mana Enadu : మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis) గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రిగా దేవేంద్ర…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *