ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ హీరోయిన్ ఫైనల్.. స్టోరీ ఇదే!

Mana Enadu : ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఆరేళ్ల తర్వాత దేవర (Devara)తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో, అదిరిపోయే కలెక్షన్లతో దూసుకెళ్తోంది. పలుచోట్ల మిక్స్ డ్ టాక్ వచ్చినా.. తారక్ (NTR) ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాను విపరీతంగా ఆదరిస్తున్నారు. ఓవర్సీస్ తో పాటు దేశవ్యాప్తంగా ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఇక దేవర సక్సెస్ జోష్ లో ఉన్న ఎన్టీఆర్ తన తదుపరి సినిమాలపైన ఫోకస్ పెడుతున్నాడు.

ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ సినిమా

అయితే ఎన్టీఆర్ దేవర తర్వాత సలార్ ఫేం ప్రశాంత్ నీల్ (Prashant Neel) తో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా ఓ అప్డేట్ తారక్ ఫ్యాన్స్ ను తెగ ఖుష్ చేస్తోంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందట. ఇక పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్నాడట. సాధారణంగానే ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరోకు ఎలివేషన్స్ ఎక్కువ. ఇక ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నాడంటే ఆ ఎలివేషన్ ఏ రేంజులో ఉంటుందోనని తారక్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

తారక్ సినిమాలో ఆ హీరోయిన్

అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఫైనల్ అయినట్లు ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ బ్యూటీ కన్నడ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయేనట. కన్నడ భామే అయినా ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచతమేనట. తన నటనకు తెలుగు ప్రేక్షకులకు కూడా ఇప్పటికే ఫిదా అయ్యారట. ఇంతకీ ఆ భామ ఎవరంటే శాండల్ వుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ సూపర్ హిట్ టాక్ అందుకున్న ‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో అలరించిన నటి రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)​.

ఎన్టీఆర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆమె

ప్రశాంత్ నీల్ టీమ్ ఇప్పటికే రుక్మిణి వసంత్​తో చర్చలు కూడా జరిపిందట. ఈ సినిమాకు రుక్మిణి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.  ఇందులో నిజమెంతో అధికారిక ప్రకటన వచ్చే వరకు తెలియదు. ఇకపోప్రశాంత్ నీల్​ – ఎన్టీఆర్​ (NTR Prashant Neel Movie) సినిమాను మైత్రీ మూవీకర్స్​, ఎన్టీఆర్ ఆర్ట్స్​ కలిసి నిర్మిస్తున్నాయి.

తారక్‍ నీల్ సినిమా స్టోరీ ఇదే

ఈ సినిమా కథ గురించి గతంలో ప్రశాంత్‌ నీల్‌ మాట్లాడుతూ – తను, ఎన్టీఆర్ (NTR Latest Movie) కాంబోలో ఓ సినిమా చేస్తున్నామంటే అంతా యాక్షన్ ఫిల్మ్ తీస్తున్నామని అనుకుంటారని అన్నారు. కానీ తారక్ తో ఆ జానర్ లో తాను సినిమా తీయాలని అనుకోవడం లేదని తెలిపారు. ఎన్టీఆర్ ఎమోషనల్ సీన్లలో నటించడంలో దిట్ట అన్న విషయం అందరికీ తెలిసిందేనని.. అందుకే  భిన్నమైన భావోద్వేగాలతో ఈ సినిమా ఉండబోతోందని ప్రశాంత్ నీల్ ఈ చిత్రం గురించి చెప్పుకొచ్చారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *