లవర్ బాయ్ ఇమేజ్ను పక్కనపెట్టి ‘చిన్నా’ లాంటి ప్రయోగాత్మక చిత్రంలో నటించి మెప్పించిన సిద్ధార్థ (Siddharth).. ఇప్పుడు మరో భిన్నమైన, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ ‘3 BHK’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమకు సొంతిల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. కీనీ అయితే పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆ కలను నెరవేర్చుకోవడం ఓ సవాలే. అయితే ఈ బ్యాక్డ్రాప్లోనే తెరకెక్కింది 3 BHK. తమ సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు సిద్దార్థ్ కుటుంబం పడే పాట్లు.. వారు చేసే త్యాగాలు.. పడే కష్టాలను ఈ మూవీలో చూపించే ప్రయత్నం చేశారు. మరి ఈరోజు (జులై 4న) రిలీజ్ అయిన ‘3 బీహెచ్కే’ సినిమా (3bhk movie review) ప్రేక్షకుల్ని మెప్పించిందో లేదో చూద్దాం.
ఇదీ కథ.. కథనం
వాసుదేవ్(Sarathkumar)ది మధ్యతరగతి కుటుంబం. హైదరాబాద్లో ఓ చిన్న కంపెనీలో పని చేస్తూ అద్దె ఇంట్లో ఉంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. ఎప్పటికైనా సొంతిల్లు కొనుక్కోవాలన్నది తన కల. దాన్ని సాకారం చేసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసినా విఫలమవుతాడు. ఇక ఆ కల కల నెరవేర్చే బాధ్యతను కొడుకు ప్రభు (Siddharth) చేతిలో పెడతాడు. కానీ ప్రభు అప్పటికే కెరీర్ పరంగా అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటూ ఉంటాడు. 34 ఏళ్ల వయసు వచ్చినా ఉద్యోగం లేక తండ్రిపైనే ఆధారపడి జీవిస్తుంటాడు. మరి అలాంటి వ్యక్తి తన తండ్రి కలను నెరవేర్చుతాడా? అందుకు ప్రభు ఏం చేశాడు? అతడికి ఎదురయ్యే అడ్డంకులు ఏమిటి అనేదే స్టోరీ.
కథ ఎలా సాగింది.. ఎవరెలా చేశారంటే..
మూవీలోని క్యారెక్టర్లు రోజూ మన మధ్య చూస్తున్న వారిలాగే సహజంగా ఉంటాయి. సినిమా ప్రారంభమైన పది నిమిషాల్లోనే ప్రేక్షకులు వాసుదేవ్ కుటుంబంతో కలిసి ప్రయాణం చేయడం ప్రారంభించేస్తారు. సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఆ కుటుంబం వేసుకునే ప్లాన్లు.. అందుకు చేసే ప్రయత్నాలు ఆసక్తిగా అనిపిస్తాయి. అయితే ఆ తర్వాత నుంచి కథంతా ప్రభు స్కూల్, కాలేజీ లైఫ్ చుట్టూనే తిరుగుతుంది. మూవీలో వావ్ అనిపించేలా ఏమీ కనిపించదు. కథ చాలా స్లోగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఓ మెగా సీరియల్లా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ ఊహకు తగ్గట్టుగా సాగుతుంటాయి. డైరెక్టర్ ఈ సినిమాని ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా నిజాయితీగా చూపించే ప్రయత్నం చేశారు. మధ్యతరగతి కుర్రాడి పాత్రలో సిద్ధార్థ్ జీవించేశాడు. శరత్ కుమార్ క్యారెక్ట్ కూడా బలంగా ఉంది. సిద్ధార్థ్ చెల్లి పాత్రలో ‘గుడ్ నైట్’ ఫేమ్ మీథా రఘునాథ్ (Meetha Raghunath) నటన కట్టిపడేసింది.
* రేటింగ్: 3/5
3BHK Movie Review: A Relatable Saga of a Family`s Dream Homehttps://t.co/ggGezyGLNR#3BHK #3BHKReview #RadioCity
— Radio City (@radiocityindia) July 4, 2025






