ManaEnadu: ‘‘వన్ స్టేట్.. వన్ కార్డ్(One State-One Card)’’ పేరుతో ఫ్యామిలీ డిజిటల్ కార్డులు(Family Digital Cards) అందుబాటులోకి తెస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. 30 శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని డిజిటల్ కార్డుగా మారుస్తున్నామని, అన్ని పథకాలకు డిజిటల్ కార్డు అనుసంధానం చేస్తామన్నారు. అర్హత కలిగినవారికి ఒక్క క్లిక్‌తో పథకాలు అందిస్తామన్నారు. రేషన్ నుంచి ఆరోగ్యశ్రీ వరకు కార్డు ఉపయోగపడుతుందన్నారు. ఆస్పత్రి రిపోర్టులు కూడా హెల్త్ కార్డు(Health Card)లో డిజిటల్ రూపంలో ఉంటాయని స్పష్టం చేశారు సీఎం రేవంత్. వన్ స్టేట్-వన్ కార్డు పైలట్ ప్రాజెక్ట్‌ను ఆయన ప్రారంభించారు.
119 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా
ఇకపై ఫ్యామిలీ డిజిటల్ కార్డే మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, రైతు బీమా కార్డు అని చెప్పుకొచ్చారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో ఇందిరమ్మ ఇల్లు, కళ్యాణ లక్ష్మి(Kalyana Lakshmi) పథకాలు అమలవుతాయని చెప్పారు. గురువారం సికింద్రాబాద్ సిక్ విలేజీ ప్రాంతంలోని హాకీ మైదానంలో కుటుంబ గుర్తింపు, డిజిటల్కార్డు పైలట్ ప్రాజెక్ట్‌ని CM రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇవి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. ఇవాళ్టి నుంచి 119 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా చేపడుతున్నామని వివరించారు.
Hon’ble Chief Minister Sri.A.Revanth Reddy participates in Launching of Family Digital Cards at Hockey Grounds,Secunderabad https://t.co/YXcyF476Rp
— Telangana CMO (@TelanganaCMO) October 3, 2024
కాంగ్రెస్‌తోనే అది సాధ్యం: రేవంత్
కొంతమందికి రేషన్ కార్డు(Ration Card)కి, ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు తేడా తెలియకపోవడం దురదృష్టకరమన్నారు. KCR అధికారంలో ఉంటే రేషన్‌కార్డు రాదని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని తెలిపారు. కొత్త రేషన్‌కార్డులు లేకపోవడంతో ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని అన్నారు. ప్రతి పేదవాడికి ఈ కార్డు ఇవ్వాలన్న లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు కుటుంబానికి రక్షణ కవచమని(A protective shield) అన్నారు. కార్డులో కుటుంబానికి సంబంధించిన వివరాలు ఉంటాయని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.