Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్.. అర్హులను గుర్తిస్తారిలా!

తెలంగాణ(Telangana)లో 6 గ్యారంటీల అమలే లక్ష్యంగా CM రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. రాష్ట్రంలో ఇటీవల ఏడాది పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అందుకు తగ్గట్లే ప్రజాపాలన విజయోత్సవాల(Praja Paalana Vijayotsavalu)ను కూడా నిర్వహించింది. ఇప్పటికే ఉచిత్ కరెంట్, మహిళలకు ఫ్రీ బస్(Free Bus), రుణమాఫీ(Runamafi), వరికి రూ.500 బోనస్ వంటి స్కీములను అమలు చేస్తోన్న సీఎం రేవంత్(CM Revanth Govt) సర్కార్.. తాజాగా మరో పథకం ఇంప్లిమెంట్ చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో నిరుపేదలు.. అర్హులు, ఇళ్లు లేని వారికి భరోసాగా నిలవాలని గవర్నమెంట్ డిసైడ్ అయింది. అందులో భాగంగానే ఇందిరమ్మ ఇళ్ల పథకాని (Indiramma Housing scheme)కి శ్రీకారం చుట్టింది.

ఈనెల 31లోపు సర్వే పూర్తి చేయాలని ఆదేశం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకాని(Indiramma Housing scheme)కి ఇప్పటికే అర్హులను గుర్తించేందుకు సర్వే(Servey) కొనసాగుతోంది. సిబ్బంది సెల్‌ఫోన్​లో యాప్‌(App) డౌన్‌లోడ్‌ చేసుకుని మరీ సర్వే చేస్తున్నారు. ప్రజా పాలనలో ఇళ్ల కోసం మొత్తం 3,02,696 దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. అందులో అసలైన అర్హులను గుర్తించే పనిలో సిబ్బంది ఉన్నారు. తొలి విడతలో సొంత స్థలం(Own Place) ఉన్నవారికి ప్రభుత్వం రూ.5 లక్షలు అందిస్తామని ఇదివరకే స్పష్టం చేసింది. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లకు రూ.5లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందనుంది. ఇదిలా ఉండగా అధికారులు ఈ నెల 31లోపు సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

సర్వేయర్లు అడిగే ప్రశ్నలివే..

* దరఖాస్తుదారు(Applicant) గతంలో ఇందిరమ్మ ఇంటి పథకం కింద ఇళ్లు పొందారా? లేదా?
* ప్రస్తుతం ఉంటున్న ఇంటి వద్ద, సొంత స్థలం వద్ద యజమానిని నిల్చోబెట్టి Photo తీస్తున్నారు.
* గతంలో ఇందిరమ్మ ఇల్లు తీసుకుంటే అనర్హులుగా గుర్తిస్తున్నారు.
* ప్రస్తుతం ఇల్లు ఎలా ఉంది? పైకప్పు వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు, వారి వివాహ స్థితిగతులపై ఆరా తీస్తున్నారు.
* సొంత స్థలం ఉంటే అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ పత్రాలు(Registration documents) ఉన్నాయా? లేదా? లేకుంటే ఇంటి పన్ను రశీదు వంటివి చూస్తారు.
* కరెంటు బిల్లు(Electricity bill), సాదాబైనామా పత్రం ఉంటే వాటిని స్కానింగ్‌(Scan) చేసి యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *