L2: Empuran: దేశంలోనే తెలుగు ఇండస్ట్రీ ది బెస్ట్: మోహన్‌ లాల్

మలయాళ స్టార్ హీరో మోహన్‌ లాల్(Mohan Lal) హీరోగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌(Prithviraj Sukumaran) తెరకెక్కించిన తాజా చిత్రం ‘L2: Empuran’. గతంలో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన ‘లూసిఫర్‌(Lucifer)’ చిత్రానికి ఇది సీక్వెల్‌గా వస్తోంది. ఈ నెల 27న‌ సినిమా విడుద‌ల కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో మేకర్స్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోహన్ లాల్‌, పృథ్వీరాజ్‌ సుకుమార‌న్‌, నిర్మాత దిల్‌రాజు(Dil Raju) తదితరులు పాల్గొన్నారు.

ఇప్పుడు త‌మ‌ సినిమా డైరెక్ట్‌గా తెలుగులోనే..

ఈ సంద‌ర్భంగా మోహ‌న్ లాల్ మాట్లాడుతూ.. తెలుగు సినీ పరిశ్రమ(Telugu film industry)ను దేశంలోనే ది బెస్ట్ ఇండస్ట్రీ(The Best Industry) అని కొనియాడారు. తెలుగు ప్రేక్షకులు నటీనటులను గౌరవించే విధానం తనను ఎంతో ఆకట్టుకుందని తెలిపారు. తన 47 ఏళ్ల కెరీర్‌లో అనేకమంది తెలుగు నటులతో కలిసి పని చేసే అవకాశం లభించిందని, అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswara Rao)తో కలిసి నటించడం తన అదృష్టమన్నారు. గ‌తంలో త‌న మ‌ల‌యాళ చిత్రాలు తెలుగులో రీమేక్ అయ్యాయ‌ని, ఇప్పుడు త‌మ‌ సినిమా డైరెక్ట్‌గా తెలుగులోనే విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. కాగా, ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీవెంకటేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్(Sri Venkateswara Creations Banner) పై నిర్మాత దిల్‌రాజు(Dil Raju) విడుద‌ల చేస్తున్న విష‌యం తెలిసిందే.

Mohanlal: ఇండియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీనే నెంబర్ 1 : మోహన్ లాల్ |  entertainment news in telugu | ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇన్ తెలుగు

ట్రైలర్ అలా చూస్తూనే ఉండిపోయా: దిల్ రాజు

దిల్ రాజు మాట్లాడుతూ… “లూసిఫర్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. మాలీవుడ్‌(Mollywood)లో అత్యధిక బడ్జెట్‌తో తీసిన ఈ సీక్వెల్ ఏ రేంజ్‌లో ఉందో టీజర్(Teaser), ట్రైలర్(Trailer) చూస్తేనే అర్థం అవుతోంది. ట్రైలర్ అలా చూస్తూనే ఉండిపోయా. ఎంతో గ్రాండియర్‌గా అనిపించింది. స్క్రీన్ మీద మోహన్ లాల్ కనిపిస్తే వావ్ అనిపిస్తుంది” అని అన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *