NBK||గ్రాండ్​గా బాలయ్య సినీజర్నీ గోల్డెన్ జూబ్లీ.. ఈ వేదికపైనే మోక్షజ్ఞ ఎంట్రీ అనౌన్స్​మెంట్

Mana Enadu: నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. తండ్రి ఎన్టీఆర్ నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఆయన వారసత్వాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొనసాగిస్తున్నాడు. బాలయ్యగా ప్రతి ప్రేక్షకుడి మనసు తడుతున్నాడు. చిన్న పిల్లల నుంచి పండు ముసలివాళ్ల వరకు బాలయ్యకు ఫ్యాన్సే. పార్టీ ఏదైనా జై బాలయ్య పాట ఉండాల్సిందే. వేదిక ఏదైనా జై బాలయ్య నినాదం రావాల్సిందే. అంతలా తెలుగు ప్రేక్షకుల మదిలో బాలయ్య కొలువుదీరిపోయాడు. సినిమా ఏదైనా.. జానర్ ఏదైనా.. వన్స్ బాలయ్య స్టెప్ ఇన్.. బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాల్సిందే. అందుకే ఆరు పదులు దాటినా ఈ నటుడికి అవకాశాలు ఇంకా తలుపు తడుతూనే ఉన్నాయి. ఆయనతో సినిమా చేసేందుకు డైరెక్టర్లు ఇంకా ఒక్క ఛాన్స్ అంటూ క్యూ కడుతూనే ఉన్నారు.

అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య అడుగుపెట్టి అప్పుడే 50 ఏళ్లు కావొస్తోంది. ఆగస్టు 30వ తేదీకి బాలయ్య సినీ ప్రయాణం 50 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఆయన్ను ఈ ఏడాది సెప్టెంబరు 1వ తేదీన ఘనంగా సన్మానించాలని నిర్ణయించింది. ఈ ఈవెంట్​కు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరవబోతున్నారని టాక్. ఈ 50 వసంతాల బాలయ్య సినీ స్వర్ణోత్సవ సంబురాలను భారీ స్థాయిలో నిర్వహించబోతున్నట్లు ఎన్‌బీకే ఫ్యాన్స్​ కూడా తెలిపారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీ నిర్వహించనున్న బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఈవెంట్​ను సెప్టెంబర్ 1న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్​లో నిర్వహించబోతున్నట్లు అందులో ఉంది. అయితే ఈ ఈవెంట్​కు స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే..? ఇదే వేడుకలో నందమూరి కుటుంబం నుంచి మరో నటవారసుడిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారట. అదెవరినో కాదండోయ్. మన బాలయ్య బాబు కుమారుడి నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీని ఈ వేదికపై అధికారికంగా ప్రకటించనున్నారని ఇప్పుడు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. ఇది చూసి బాలయ్య ఫ్యాన్స్ తెగ సంబుర పడిపోతున్నారు.

1974 ఆగస్టు 30న “బాలయ్య నటించిన తొలి చిత్రం తాతమ్మ కల రిలీజ్ అయింది. 1974 నుంచి 2024 వరకు 50ఏళ్ల పాటు నిర్విరామంగా ప్రతిఏడాది సినిమాలతో అలరిస్తున్నారు. కేవలం హీరోగానే 109 సినిమాలు చేశారు. మొత్తంలో 129 హీరోయిన్లతో పని చేశారు. 100 రోజుల నుంచి 1000 రోజుల వరకు ఆయన సినిమాలు ఆడిన సందర్భాలున్నాయి. సోషల్, మైథాలజీ, హిస్టారికల్, ఫోక్​లోర్​, బయోపిక్, సైన్స్ ఫిక్షన్ ఇలా అన్ని జానర్​లోనూ సినిమాలు చేసి సక్సెస్​ సాధించారు.” అని ఆ ఆహ్వాన పత్రికలో రాసుకొచ్చారు.

 

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *