Mana Enadu: మీరు ఆన్ లైన్ షాపింగ్ ఎక్కువగా చేస్తుంటారా.. అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో సేల్కు రెడీ అయింది. సాధారణంగా అమెజాన్ దాదాపుగా ప్రతి నెలకు ఓ సేల్ పెడుతుంది. ముఖ్యంగా పండుగలు, ఇతర స్పెషల్ ఈవెంట్స్ ఉన్న రోజుల్లో తప్పకుండా సేల్ అనౌన్స్ చేస్తుంటుంది. ఈ సేల్ లో తక్కువ ధరలకే ఉత్పత్తులను విక్రయిస్తుంది. అందుకే కస్టమర్స్ అమెజాన్ సేల్ అనగానే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
ఈ నేపథ్యంలో ఆగస్టు నెలలో స్పెషల్ సేల్ అమెజాన్ మళ్లీ ముందుకువచ్చింది. ఇటీవలే ప్రైమ్ మెంబర్ల కోసం ప్రత్యేకంగా ప్రైమ్ డే సేల్ నిర్వహించిన ఈ కంపెనీ.. ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Freedom Festival Sale) తో కస్టమర్లను ఆకర్షించేందుకు రెడీ అయింది. మరి ఈ సేల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది..? ఇందులో ఏయే ఉత్పత్తులకు డిస్కౌంట్స్ ఉంటాయో తెలుసుకుందామా..?

అమెజాన్ సేల్ ఎప్పటి నుంచి అంటే..?
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఆగస్టు 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరగనుంది. ప్రైమ్ కస్టమర్లకు 6వ తేదీ అర్ధరాత్రి నుంచి, సాధారణ కస్టమర్లకు మధ్యాహ్నం నుంచి ఈ సేల్ అందుబాటులోకి వస్తుందని ఈ కంపెనీ పేర్కొంది.
డిస్కౌంట్ల వివరాలు ఇవే..?
ఈ సేల్‌లో ఎస్బీఐ క్రెడిట్ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఇతర గృహోపకరణాలు, అలెక్సా డివైజులపై డిస్కౌంట్లు ఉండనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి వెబ్సైట్లో బ్యానర్‌ను సిద్ధం చేసింది. మొబైల్స్‌పై 40 శాతం, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 80 శాతం, ఫ్యాషన్ ఉత్పత్తులపై 70 శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నట్లు అమెజాన్ పేర్కొంది. స్మార్ట్‌టీవీలు, ప్రొజెక్టర్లు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్‌లపైనా డిస్కౌంట్లు ఉంటాయని వెల్లడించింది. ఉత్పత్తుల వారీగా ఆఫర్ల వివరాలు త్వరలో రివీల్ చేయనున్నట్లు అమెజాన్ తెలిపింది. ఇంకెందుకు ఆలస్యం ఈ సేల్ లో మీకు కావాల్సినవి తక్కువ ధరకే కొనేయండి మరి.






