TELEGRAM : ‘ఆ కంపెనీ మార్కెట్ వాల్యూ రూ.2.5 లక్షల కోట్లు.. 30 మందే ఉద్యోగులు.. HR కూడా లేదు’

ManaEnadu:టెలిగ్రామ్ (Telegram App) భారత్​లో రెండో అతిపెద్ద సోషల్ మీడియా యాప్. ఈ మెసేజింగ్ యాప్​లో ఫ్రీగా సందేశాలు పంపొచ్చు. వీడియోలు. ఆడియోలు, డాక్యుమెంట్లు పంపొచ్చు. చూడటానికి వాట్సాప్​లాగే ఉన్నా.. ఇది దానికి అప్డేటెడ్ వెర్షన్ అని చెప్పొచ్చు. ఇంది కూడా ఒకరకంగా గూగుల్​లాంటిదేనని చెప్పొచ్చు. గూగుల్ ఎలాగైదే మనం ఏ సమాచారం అడిగితే అది చూపిస్తుందో.. టెలిగ్రామ్ కూడా అందులో ఉన్న గ్రూప్స్​లో జాయిన్ అయి.. మనకు కావాల్సిన సమాచారం, సినిమాలు, డాక్యుమెంట్స్ ఇలా ఏది కావాలన్నా అది క్షణాల్లో మన ముందుంటుంది. అందుకే భారత్​లో దీనికి వినియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అయితే ఇటీవలే టెలిగ్రామ్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్‌ దురోవ్‌ (Telegram CEO Pavel Durov) అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే.

30 మంది ఉద్యోగులు.. రూ.2.5 లక్షల టర్నోవర్

తాజాగా ఈ విషయంపై ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా (Harsh Goenka) మాట్లాడుతూ.. టెలిగ్రామ్‌ కార్యకలాపాలకు సంబంధించి ఓ కీలక విషయాన్ని షేర్ చేసుకున్నారు. ఇటీవల అరెస్టయిన పావెల్ దురోవ్ నేతృత్వంలో టెలిగ్రామ్​కు 100 కోట్ల మంది యూ జర్స్ ఉన్నారని.. ఈ కంపెనీ మార్కెట్ విలువ 30 బిలియన్ డాలర్లు అంటే అక్షరాలా రూ.2.5 లక్షలు కోట్లు ఉంటుందని తెలిపారు. దీనిలో యాడ్స్ కూడా లేవని.. వెల్లడించారు. అయితే ఈ కంపెనీలో పని చేస్తుంది కేవలం 30 మంది ఇంజినీర్లు మాత్రమేనని.. దీనికి హెచ్​ఆర్ (Human Resource Department) కూడా లేదని పేర్కొన్నారు. ఈ కంపెనీకి సంబంధించిన అన్ని కార్యకలాపాలు ఫౌండర్ దురోవ్ చూసుకుంటారని వివరించారు.

అది సమర్థమైన వ్యాపార విధానమంటే..

గతంలో పావెల్ దురోవ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కంపెనీ గురించి చెప్పిన విషయాలను హర్ష గోయెంకా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా దురోవ్ తన కంపెనీలో ఇంజినీర్లను ప్రపంచ వ్యాప్తంగా అత్యున్నత ప్రతిభ గలిగిన వారిని ఆన్​లైన్ కంటెస్టుల ద్వారా నియమించుకుంటారని హర్ష గోయెంకా తెలిపారు. ఆయన పాటిస్తున్న ఈ విధానాన్ని సమర్థమైన వ్యాపార విధానం అని పిలుస్తారని పేర్కొన్నారు.

ఇక దురోవ్ గతంలో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నా కంపెనీలో 30 మంది ఇంజినీర్లు పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న నా సంస్థకు నాలుగు ఖండాల్లో మొత్తంగా 102 మంది ఉద్యోగులు ఉన్నారు.” అని చెప్పారు. ఇక ఆగస్టు 24న అజర్‌బైజాన్ నుంచి లే బోర్గట్‌ విమానాశ్రయానికి చేరుకున్న పావెల్ దురోవ్ (Pavel Durov Arrested)​ను కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. కంటెంట్‌ నియంత్రణ సరిగా లేకపోవడం వ్యవస్థీకృత నేర కార్యకలాపాలను వేదికగా మారడం వంటి అభియోగాలపై గతంలో అరెస్టు వారెంట్ జారీ కాగా ఆయన అధికారులకు సహకరించకపోవడంతో తాజాగా పారిస్​లో ఎయిర్ పోర్టులో దిగగానే ఆయణ్ను అరెస్టు చేశారు.

Related Posts

Gold & Silver Price: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు (Gold Rate) భారీగా పెరిగాయి. అంతర్జాతీయ, జియోపాలిటికల్ పరిణామాల నేపథ్యంలో ఈ పెరుగుదల నమోదైంది. ఇండియా-అమెరికా మధ్య టారిఫ్‌ల ప్రభావం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, డాలర్‌(Dollar) క్షీణత వంటి కారణాలతో అంతర్జాతీయంగా పసిడి, వెండి ధరల (Gold…

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. కేజీ వెండి రేటెంతంటే?

బంగారం ధరలు(Gold Rates) రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌(Hyderabad Bullion Market)లో ఈ రోజు (ఆగస్టు 29) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 పెరిగి రూ.1,03,310కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *