థియేటర్ల బంద్(Theaters Bandh)పై తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్(Telangana Film Chamber) ఎలాంటి ప్రకటన చేయలేదని, అలాగే తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌కు ఎలాంటి లేఖ రాయలేదని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(TFCC) నూతన కార్యదర్శి శ్రీధర్(Secretary Sridhar) స్పష్టం చేశారు. ఫిల్మ్ ఛాంబర్ నూతన కార్యదర్శిగా శ్రీధర్‌ను సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇటీవల థియేటర్ల బంద్ అంశాన్ని ఇద్దరు డైరెక్టర్లు, మరో ఇద్దరు నిర్మాతలు అనవసరంగా వివాదాస్పదం చేశారని ఆరోపించారు. వారి పేర్లను త్వరలోనే వెల్లడించి, తగిన ‘Return Gift’ ఇస్తామని హెచ్చరించారు.

సికింద్రాబాద్‌లోనే ఆరు థియేటర్లు మూతపడ్డాయి..
అలాగే హీరోలు రెండేళ్లకో సినిమా చేస్తుండటంతో సింగిల్ స్క్రీన్ థియేటర్ల(Single screen theaters) పరిస్థితి దయనీయంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “ఇటీవల సికింద్రాబాద్‌లోనే ఆరు థియేటర్లు మూతపడ్డాయి. జనవరి నుంచి ఇప్పటివరకు ‘సంక్రాంతి వస్తున్నాం’, ‘Mad Square’, ‘Court’ చిత్రాలు మాత్రమే విజయం సాధించాయి. ఇలాగైతే మేం ఎలా బతకాలి?” అని ఆయన ప్రశ్నించారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan) సినిమా కోసం థియేటర్లను ఖాళీగా ఉంచితే, ఆ సినిమా వాయిదా పడిందని, దీంతో తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వాపోయారు.
హీరోలకు స్టార్ హోదా ఎక్కడి నుంచి వచ్చింది?
“అనవసరంగా సింగిల్ స్క్రీన్లను బద్నాం చేస్తున్నారు. హీరోలకు స్టార్ హోదా(Star status) ఎక్కడి నుంచి వచ్చింది? ఒకప్పుడు హీరోలు ఏడాదికి 2, 3 సినిమాలు చేసేవారు. ఇప్పుడు ఒక్కో హీరో ఏడాదికి ఒక్క సినిమా కూడా చేయడం లేదు. రూ.10 లక్షలు తీసుకునే హీరోకి తర్వాతి సినిమాకు రూ.30 లక్షలు ఇస్తున్నారు. ఇటీవల విడుదలైన ఓ సినిమా డిజాస్టర్ అయితే, ఆ హీరోని పిలిచి రూ.13 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారు” అని శ్రీధర్ ఆరోపించారు.






