Sardar-2: కార్తి ‘సర్దార్ 2’ షూటింగ్ కంప్లీట్.. రిలీజ్ డేట్ మారతుందా?

తమిళ్ స్టార్ యాక్టర్ కార్తి (Karthi), డైరెక్టర్ పీఎస్‌ మిత్రన్‌ (Director P.S. Mithran) కాంబినేషన్‌లో తెరకెకకుతోన్న లేటెస్ట్ మూవీ ‘సర్దార్‌ 2(Sardar-2)’. ఇది 2022లో విడుదలైన బ్లాక్‌బస్టర్ తమిళ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సర్దార్”కు సీక్వెల్‌గా రూపొందుతోంది. ప్రిన్స్ పిక్చర్స్, IV ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌‌లలో ఎస్‌.లక్ష్మణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవికా మోహనన్(Malavika Mohanan), అషికా రంగనాథ్(Ashika Ranganath) హీరోయిన్లుగా నటిస్తున్నారు. SJ సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నారు. రజిషా విజయన్, ఓ.ఎ.కె. సుందర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా ‘Spy vs Black Dagger’ అనే థీమ్‌తో రూపొందుతోంది. తాజాగా ఈ మూవీ గురించి అప్డేట్ వచ్చేసింది.

మరోసారి డ్యూయల్ రోల్‌లో కార్తి

సర్దార్ 2తో బాక్సాఫీస్ దగ్గర కార్తీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడోనని ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ వర్క్(Shooting work) పూర్తి అయినట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఈ మేరకు మూవీ టీమ్ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా సర్దార్‌కు సీక్వెల్ చిత్రంతో వస్తుండటంతో ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది. కార్తి మరోసారి డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. కాగా సర్దార్-2ను దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తొలుత నిర్ణయించారు. అయితే అనుకున్నదాని కంటే ముందుగానే షూటింగ్ కంప్లీట్ అవడంతో కాస్త ముందుగానే విడుదలచేసే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే మేకర్స్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *