Thala Ajith: స్టార్ హీరో అజిత్‌కు తప్పిన ప్రమాదం.. ఇంతకీ ఏమైందంటే?

నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్ స్టార్ హీరో అజిత్(Ajith). ఓపైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు తన హాబీ అయిన రేసింగ్‌(Racing)ను కూడా ప్రోత్సహిస్తూ.. ప్రపంచ స్థాయిలో విజయాలను సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రేసింగ్ రంగంలో ఎన్నో విజయాలను సాధించిన ఈ సినీయర్ నటుడు.. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్‌లో సక్సెస్ అయ్యేందుకు కసరత్తులు చేస్తున్నారు. అయితే ఈ ప్రయత్నంలో ఇవాళ అజిత్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఇంతకీ విషయం ఏంటంటే..

అదృష్టవశాత్తూ ఎలాంటి గాయాలు కాలేదు

అజిత్ పెద్ద ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు.. అవును మీరు విన్నది నిజమే. రేసింగ్ ప్రాక్టీస్‌(Racing practice)లో ఉన్నప్పుడు ఆయన రైడింగ్ కారు అనూహ్యంగా అదుపు తప్పి ట్రాక్ పక్కన ఉన్న గోడను ఢీకొట్టింది. ఈ ఘటన చూసిన సిబ్బంది ఒక్కసారిగా భయంతో ఆయన వద్దకు పరుగెత్తారు. అదృష్టవశాత్తూ, అజిత్ ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఈవెంట్ భద్రతా సిబ్బంది(Event security personnel) వెంటనే స్పందించి ఆయనను మరో వాహనంలో అక్కడ్నించి తరలించారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అజిత్ రేసింగ్‌ కోసం దుబాయి(Dubai)లో శిక్షణ పొందుతున్నాడు. శిక్షణ(Training) సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా అజిత్ రేసింగ్ ప్రాక్టీస్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది.

రెండు సినిమాలు వాయిదా

కాగా అజిత్ తాజా సినిమా ‘విడాముయర్చి’ విడుదలను అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు లైకా ప్రొడక్షన్స్(
Lyca Productions) ప్రకటించడంతో, సంక్రాంతికి అజిత్ సినిమా చూడాలనుకున్న అభిమానులు నిరాశ ఎదురైంది. ‘విడాముయర్చి’ వాయిదా పడినా, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly)’ ఈ ఏడాది సంక్రాంతికి వస్తుందా అనే ఆశలు రేకెత్తాయి. కానీ దానికి అవకాశం లేదని తేలిపోయింది. ఇదిలా ఉండగా, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. వేసవి సెలవుల సందర్భంగా APRIL 10న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు కొత్త పోస్టర్‌(New Poster)తో ప్రకటించారు.

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *