
రాబోయే రోజుల్లో అగ్నిప్రమాదాలు సంభవిస్తాయని, మహమ్మారి వెంటాడుతుందని, భక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలని మాతంగి స్వర్ణలత(Mathangi Swarnalatha) భవిష్యవాణి(Bhavishyavani) వినిపించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల(Secunderabad Ujjaini Mahankali Bonalu) ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రంగం(Rangam) కార్యక్రమాన్ని సోమవారం ఉదయం నిర్వహించారు. ఈ ఏడాది వర్షాలు(Rains) సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని చెప్పారు. నా రూపాన్ని పెట్టడానికి అడ్డుపడుతున్నారు. త్వరలో రక్తం కక్కుకొని చచ్చిపోతారు అని హెచ్చరించారు.
నాకు గోరంత కూడా ఖర్చు పెట్టడం లేదు..
‘నా ప్రజలందరూ సంతోషంగా బోనాలు(bonalu) చేశారు. ప్రతి ఏడాది ఏదో ఒకటి మాత్రం తక్కువ చేస్తున్నారు. ఎన్నిసార్లు కోరినా నా కోరిక మాత్రం మీరు నెరవేర్చడం లేదు. తల్లి దండ్రులు లేని పిల్లలను ఆదరించడం లేదు. కోరిన వరాలు ఇచ్చినా నాకు గోరంత కూడా ఖర్చు పెట్టడం లేదు. అయినా నేనెప్పుడూ కోపం చూపించండం లేదు. నా బిడ్డలైన మిమ్మల్ని శాంతంగా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నాను. కానీ కాలం తీరిందంటే ఎవరైనా వెళ్లాల్సిందే, అందులో నా పాత్ర కూడా ఉంటుందని తెలుసుకోండి.
నాకు చేయాల్సినవి చేయకపోతే..
ఈ ఏడాదిలో నాకు చేయాల్సినవి చేయకపోతే అడ్డుపడుతున్న వారు రక్తం కక్కుకొని చస్తారు, అది చూస్తారా లేక చేయాల్సినవి చేస్తారో వారికే వదిలేస్తున్నా. రాష్ట్రాన్ని కాదు దేశాన్ని కూడా కాపాడుకుంటా. రాబోయే రోజుల్లో ఓ మహమ్మరి(Virus) రాబోతుంది భక్తులంతా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏడాది వర్షాలు సరిగా కురిసి పంటలు బాగానే పండుతాయి. ఐదు వారాలు పప్పుబెల్లం.. శాక, పసుపు కుంకుమలతో కొంగు బంగారం చెయ్యండి.. నాకు మాత్రం రక్తం చూపించకపోతే ఊరుకోను.. గ్రామం మొత్తం సంచారం చేస్తాను.. ఎవ్వరు ఆపినా నేను ఆగను’ అని మాతంగి స్వర్ణలత భవిష్యవాని వినిపించారు.