డాక్టర్ల చేతిరాత ఎందుకు అర్థం కాదో మీకు తెలుసా? కారణాలు ఇవే!

మనలో చాలా మందికి డాక్టర్లు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ల( prescription)ను చూస్తే అసలు వారు ఏం రాశారో అర్థం కాక చేతులెత్తేస్తాం. మెడికల్ షాపుల్లో ఫార్మసిస్ట్‌ల సహాయం తీసుకోవాల్సి వస్తుంది. ఇది కేవలం మన దేశంలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యే. అయితే డాక్టర్ల చేతిరాత ఎందుకు అంత గందరగోళంగా ఉంటుందో మీకు తెలుసా?

ప్రధాన కారణం

డాక్టర్లు రోజూ వందలాది మంది పేషెంట్లను చూసి చికిత్స ఇస్తుంటారు. ప్రతి వ్యక్తికీ తక్కువ సమయంలోనే ప్రిస్క్రిప్షన్ రాయాల్సి రావడం (Handwriting)వల్ల వేగంతో రాయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాత అస్తవ్యస్తంగా మారుతోంది. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో రాత కంటే చికిత్స మక్కువగా మారుతుంది.

మెడికల్ షార్ట్‌కట్‌లు

వైద్యులు ఎక్కువగా తాము మాత్రమే అర్థం చేసుకునే సంక్షిప్త పదజాలాన్ని వాడతారు. ఉదాహరణకు “BID” అంటే రోజుకు రెండుసార్లు, “TID” అంటే రోజుకు మూడుసార్లు అనే అర్థాలు ఉన్నాయి. ఇవి సాధారణ ప్రజలకు అర్థం కావడం కష్టం.

శిక్షణలో రాతకు తక్కువ ప్రాధాన్యం

డాక్టర్లు చదివే సమయంలో ఎక్కువ శ్రద్ధ చికిత్స, డయాగ్నోసిస్‌పై ఉంటుంది. రాత పద్ధతిని మెరుగుపరచడం అనే అంశానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. విద్యార్థి దశ నుంచే వేగంగా నోట్స్ రాయడం అలవాటవుతుంది.

డిజిటల్ ప్రిస్క్రిప్షన్లు ప్రాముఖ్యం

నేడు కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు డిజిటల్ ప్రిస్క్రిప్షన్లను వాడుతున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాలు, చిన్న క్లినిక్‌లలో ఇప్పటికీ చేతిరాతే ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల అప్పుడప్పుడు తప్పుడు మందులు, మోతాదుల విషయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కొంతమంది డాక్టర్లు రోగులకు పూర్తిగా సమాచారం అర్థం కాకుండా ఉండేలా రాయడం, వారి ఆందోళన తగ్గించడంలో సహాయపడుతుందని భావిస్తారు. కానీ ఇది ప్రజలకు గందరగోళంగా మారుతుంది.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *