F2,F3 మూవీలతో సూపర్ హిట్స్ తర్వాత విక్టరీ వెంకటేశ్(Victory Venkatesh), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో వచ్చిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం(Sankrantiki Vasthunnam)’. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేశ్(Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి(Meenakshi Choudari) హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. వెంకీ, ఐశ్వర్య, మీనాక్షిల నటనతో పాటు బుల్లిరాజు(Bulliraju) కామెడీ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బంపర్ హిట్ అందుకుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో న్యూస్ బయటికొచ్చింది. అదేంటంటే..

రీమేక్ ప్రయత్నాలు షురూ..
కుటుంబ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈ మూవీని హిందీలో రీమేక్(Hindi Remake) చేసేందుకు ప్రయత్నాలు షురూ అయ్యాయి. నిర్మాత దిల్ రాజు(Dil Raju) ఇప్పటికే ఆ పని మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)తో సినిమా చేయనుండటంతో.. ఈ చిత్ర రీమేక్‌ను ఆయన డైరెక్ట్ చేయట్లేదని సమాచారం. అయితే ఈ మూవీ హిందీ ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుందని, ఎలాగైనా రీమేక్ చేయాలనే పట్టుదలతో దిల్ రాజు ఉన్నట్లు టీటౌన్ వర్గాలు అంటున్నాయి.
డైరెక్టర్ ఫిక్స్ అవగానే..
అంతేకాదండోయ్.. ఈ రీమేక్ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) నటించబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఈ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే డైరెక్టర్ ఫిక్స్ అవగానే ఈ మూవీని దిల్ రాజు అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారని సినీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో త్వరలోనే క్లారిటీ రానుంది.








