NC-24: రెండో షెడ్యూల్ షురూ.. నాగ చైతన్య మూవీ నుంచి మరో అప్డేట్

అక్కినేని హీరో నాగచైతన్య (Akkineni Naga Chaitanya) ‘తండేల్(Thandel)’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 7న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ చైతూ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది. ఈ ఈ మూవీకి చందూ మొడేటి (Chandoo Mondeti) దర్శకత్వం వహించాడు. ఇందులో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి (Sai Pallavi)హీరోయిన్‌గా నటించింది. మూవీ రిలీజ్‌కు ముందే సాంగ్స్‌తో హ్యాట్రిక్ హిట్ అందుకుందీ చిత్రం. ఇక ఆ తర్వాత చైతూ గ్యాప్ తీసుకున్నాడు. ఇక రీసెంట్‌గా తన తర్వాతి ప్రాజెక్టుపై ఫోకస్ చేశాడు నాగచైతన్య. ప్రస్తుతం ఆయన ‘విరూపాక్ష’ ఫేమ్‌ కార్తీక్‌ దండు(Director Karthik Dandu) దర్శకత్వంలో NC-24 అనే మూవీలో నటిస్తున్నాడు.

చాలా స్టైలీష్ అండ్ సీరియస్ లుక్‌లో చైతూ

ఈ మూవీని సుకుమార్‌ రైటింగ్స్‌(Sukumar Writings)తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌లో BVSN ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మిథికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌లో చైతన్య మునుపెన్నడూ చేయని డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఇక ఇందులో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Choudari) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్‌(Hyderabad)లో స్టార్ట్ అయినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌(Special Poster)ను రిలీజ్ చేస్తూ ‘ఒక అడుగు ముందుకు మరో అడుగు దగ్గరగా.. రెండో షెడ్యూల్ మొదలైంది’ అనే క్యాప్షన్ జోడించారు. ఇక పోస్టర్‌లో నాగ చైతన్య చాలా స్టైలీష్ అండ్ సీరియస్ లుక్‌లో కనిపించాడు. చేతిలో కత్తి పట్టుకుని గంభీరంగా కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా(Social Media)లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

Naga Chaitanya - Meenakshi Chaudhary roles in NC24 revealed | cinejosh.com

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *