BREAKING: అసిస్టెంట్​పై రేప్ కేసులో.. గోవాలో జానీ మాస్టర్ అరెస్టు

ManaEnadu:టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం కేసులో పరారీలో ఉన్న జానీ మాస్టర్​ను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. గోవాలో ఉన్న జానీ మాస్టర్​ను సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు అదుపులోకి (Jani Master Arrest) తీసుకున్నారు. అనంతరం గోవా కోర్టులో హాజరు పరిచి పీటీ వారెంట్ కింద ఆయణ్ను హైదరాబాద్ తీసుకురానున్నారు.

జానీ మాస్టర్ అరెస్టు 

అసిస్టెంట్ కొరియాగ్రాఫర్​పై అత్యాచారం (Rape Case) కేసులో జానీ మాస్టర్‌పై నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అధికారులు పరారీలో ఉన్న అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయణ్ని బెంగళూరులో అరెస్టు చేశారు. మరోవైపు ఈ కేసులో కొత్తగా పోక్సో సెక్షన్లనూ FIRలో చేర్చారు. 

జానీ మాస్టర్​పై పోక్సో కేసు..

డాన్స్ మాస్టర్ జానీ కేసులో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు అతని పై పొక్సో యాక్ట్ సైతం మోపారు. జానీ మాస్టర్‌ తనపై 2019లో అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో తెలిపింది. అప్పుడు బాధితురాలి వయసు పరిగణనలోకి తీసుకున్న పోలీసులు కేసులో తాజాగా పోక్సో చట్టాన్ని (Posco Case) చేర్చారు.

గోప్యంగా ఆధారాలు

యువతి ఫిర్యాదు ఆధారంగా తొలుత అత్యాచారం, నేరపూరిత బెదిరింపు, దాడి సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అధికారులు.. అఘాయిత్యం జరిగినప్పుడు ఆమె మైనర్‌ (Minor) అని తేలడంతో పోక్సో చట్టం యాడ్ చేశారు. ఈ ఘటనపై ఆధారాలు సేకరిస్తున్న నార్సింగి పోలీసులు.. వాంగ్మూలం సేకరణ, దర్యాప్తు వివరాలను సీక్రెట్​గా ఉంచుతున్నారు.

మరోవైపు జానీ మాస్టర్ లైంగిక వేధింపుల (Sexual Harassment)పై బాధిత యువతి మహిళా కమిషన్‌ను ఆశ్రయించిందని కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శారద తెలిపారు. మహిళా కమిషన్ సహా ప్రభుత్వం ఎప్పుడూ మహిళలకు అండగా ఉంటుందని స్పష్టంచేశారు. పని ప్రదేశాలతో పాటు ఎక్కడైనా సరే ఆడవాళ్లు వేధింపులకు గురైతే.. నిర్భయంగా కమిషన్‌కు చెప్పొచ్చని అన్నారు. ఎంత పలుకుబడి ఉన్నా.. న్యాయం ముందు ఓడిపోక తప్పదని హెచ్చరించారు.

 

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *