ManaEnadu : తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘కంగువా’ (Kanguva). శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మొదట అక్టోబర్ 10వ తేదీన దసరా కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల విడుదలను వాయిదా వేశారు. ఇక తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్ ఇంతకీ ఎప్పుడంటే?
కంగువా రిలీజ్ డేట్ ఫిక్స్
సూర్య-శివ కాంబోలో వస్తున్న కంగువా సినిమా విడుదల తేదీని ఇవాళ చిత్రబృందం ప్రకటించింది. నవంబర్ 14వ తేదీన (KanguvaFromNov14) ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాలో సూర్య మూడు భిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నాడు. ఇందులో సూర్యకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ దిశాపటానీ నటిస్తోంది మరో కీలక పాత్రలో బీటౌన్ నటుడు, యానిమల్ ఫేం బాబీ దేవోల్ కనిపించనున్నాడు.
రెండున్నరేళ్లు.. వేయి మందికిపైగా
పది భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు పలు అంతర్జాతీయభాషల్లోనూ విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ (Kanguva Trailer) సినీప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ‘కంగువా కోసం దాదాపు రెండున్నరేళ్ల పాటు సుమారు 1000 మందికి పైగా శ్రమించినట్లు ఇటీవల సూర్య చెప్పాడు.
ముందు తలైవా.. తర్వాతే నేను
అయితే అక్టోబర్ 10వ తేదీన రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్ (Vettaiyan)’ రిలీజ్ ఉండటంతో కంగువాను వాయిదా వేసినట్లు పరోక్షంగా చెప్పాడు సూర్య. తలైవా తనకు సీనియర్ అని, తాను పుట్టే సమయానికి ఆయన ఇండస్ట్రీలో స్టార్ హీరో (Thalaiva) అయ్యారని అన్నాడు. అందుకే ఆయన సినిమాయే ముందు వస్తే బాగుంటుందని తన అభిప్రాయం అని చెప్పుకొచ్చాడు. కంగువా ఎప్పుడు విడుదలైనా అభిమానులు తన సినిమాపై ప్రేమ చూపిస్తారనే నమ్మకం ఉందని తెలిపాడు.
The Battle of Pride and Glory, for the World to Witness ⚔🔥#Kanguva's mighty reign storms screens from 14-11-24 🤎#KanguvaFromNov14 🦅 @Suriya_offl @thedeol @directorsiva @DishPatani @ThisIsDSP #StudioGreen @GnanavelrajaKe @vetrivisuals @supremesundar @UV_Creations… pic.twitter.com/de3yYAL0BI
— Studio Green (@StudioGreen2) September 19, 2024